హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: తరాలు మారినా తీరని చేనేతల కష్టాలు!

Warangal: తరాలు మారినా తీరని చేనేతల కష్టాలు!

X
చేనేత

చేనేత వారి కష్టాలు

Warangal: ప్రభుత్వాలు మారుతున్నా చేనేతలకు కష్టాలు తప్పడం లేదు. ఇక్కడ పరిశ్రమలు లేక పొరుగు రాష్ట్రాలకు ఎగుమతికి కష్టమై పాట్లు పడుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Santosh, News18, Warangal.

ప్రభుత్వాలు మారుతున్నా చేనేతలకు కష్టాలు తప్పడం లేదు. ఇక్కడ పరిశ్రమలు లేక పొరుగు రాష్ట్రాలకు ఎగుమతికి కష్టమై పాట్లు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే పత్తి అత్యధికంగా పండే ప్రాంతం వరంగల్ . అయితే ఇక్కడ పండిన పత్తిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తే.. అక్కడ దాన్ని దారాన్ని తయారు చేసి మళ్ళీ తిరిగి మన తెలుగు రాష్ట్రాలకే వస్తుంది. దీని వలన దారంపై అదనంగా జీఎస్టీ చార్జీలు, రవాణా చార్జీలు తోడవడంతో రైతులు నష్టపోతున్నారు. వరంగల్ జిల్లాలో చేనేత కార్మికుల సంఖ్య అధికంగానే ఉంటుంది. చేతి మగ్గాలపై ఉపాధి పొందే వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. ఐతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి సాగు అధికంగా ఉంటుంది.

నాణ్యమైన పత్తి, ఎన్నో జిన్నింగ్ మిల్లులు ఉన్నపటికీ పరిశ్రమలు లేకపోడంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఐతే నూలును ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. దీనితో రవాణా చార్జీలు ఎక్కువైపోతున్నాయి. దీనితో యజమానులకు గిట్టుబాటు దక్కడం లేదు. ఐతే గతంలో ఇక్కడ నూలు పరిశ్రమలు ఉండేవి.. కానీ వారికి సరైన ప్రోత్సాహం లేకపోవడంతో నష్టపోయారు. హనుమకొండ జిల్లా మడికొండలోని పారిశ్రామిక వాడలో సుమారు ౩౦౦ యూనిట్ల మగ్గాలతో పరిశ్రమలు ఉన్నాయి. వరంగల్ కేంద్రంలోని కొత్తవాడలో అనేక మంది కార్మికులు దీనిని నమ్ముకొని ఉన్నారు.

ప్రభుత్వం దృష్టి సారించి, రాయితీలు కల్పించి నూలు తీసే మిల్లును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దాని వలన రైతులకు, చేనేత కార్మికులు లబ్ది పొందుతారని, కార్మికులకు శ్రమ తగ్గడంతో పాటు ఆర్ధికంగా మేలు అవుతుందని వరంగల్ జిల్లా చేనేత సహకార సంఘం అధ్యక్షుడు సాంబయ్య అంటున్నారు. తాము సుమారు 35 సంవత్సరాలుగా ఇదే వృత్తిలో ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం.

PM Narendra modi: మనది బానిసల చరిత్ర కాదు.. వీరుల చరిత్ర.. లచిత్ 400వ జయంతి వేడుకలో ప్రధాని మోదీ

ఈ కుల వృత్తిలో అలవాటు పడి వేరే పనిచేయలేక పోతున్నాం. ఒక రోజుకి 200 రూపాయలే వస్తున్నాయి. దీంతో కుటుంబ పోషణ కూడా కష్టమవుతుంది. కనీసం రోజుకి 500 కూలి కూడా రాకపోతే బ్రతకడం ఎలా అని కార్మికులు వాపోతున్నారు.

First published:

Tags: Local News, Telangana, Warangal