Santosh, News18, Warangal
వరంగల్ నగరం (Warangal City) లో ట్రాఫిక్ నియంత్రణపై పోలీస్ కమిషనర్ రంగనాథ్ ప్రత్యేక దృష్టి సాధించారు. గతంలో హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా పనిచేసిన అనుభవంతో ఇక్కడ కూడా ట్రాఫిక్ నియంత్రణకు శ్రీకారం చుట్టారు. ఏళ్ల నాటి నుండి ఉన్న ట్రాఫిక్ సమస్యకు దారి చూపిస్తున్నారు. చలాన్లు, జరిమానాల ద్వారా ఆదాయాన్ని సమీకరించే టార్గెట్లకు భిన్నంగా ట్రాఫిక్ ఫ్రీ విరోధకాన్ని రూపకల్పన చేశారు. నిత్యం ట్రాఫిక్ జామ్ అయ్యే కొన్ని జంక్షన్లపై ఫోకస్ పెట్టి వాటిని క్రమబద్ధీకరించేందుకు కృషి చేస్తున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటి వరకు వరంగల్ బట్టల బజార్, వరంగల్ చౌరస్తా, హనుమకొండ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా ఏరియాలలో చిరు వ్యాపారాలు, అడ్డా కూలీలకు ప్రత్యామ్నాయం చూపించి రోడ్లపై రద్దీని తగ్గించారు.
ఇక, నెంబర్ ప్లేట్ లేని వాహనదారులపై చీటింగ్ కేసు నమోదు చేస్తున్నారు. ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు వాడినా.. నెంబరు కనబడకుండా మాస్కులు పెట్టినా.. తుడిచి వేసినా కేసులు పెడుతున్నారు. ఈనెల నుండి డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే వాహనాలను కూడా సీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట సిటీలలో ట్రాఫిక్ చిక్కులతో పాటు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఆపరేషన్ రోడ్ వేకు ప్రణాళిక రూపొందించనున్నారు.
అయితే కానీ ఉదయం పూట ఆఫీసులకు వెళ్లే సమయంలో వాహన తనిఖీ పేరుతో వాహనాలను ఆపడం వల్ల తమ సమయం వృధా అవుతుందని కొంతమంది ఉద్యోగులు అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకే చలాన్ల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. చలాన్ల పేరుతో వాహనచోదకులను ఆపాలంటే ముందుగా ప్రమాదాలు జరగకుండా రోడ్లను బాగు చేయించాలని ప్రజలు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal