హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: ఈ సర్కస్ చూస్తే గూస్ బంప్స్ ఖాయం!

Warangal: ఈ సర్కస్ చూస్తే గూస్ బంప్స్ ఖాయం!

X
circus

circus

సర్కస్ అంటే ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రయాణిస్తూ సందర్శకుల కోసం చిత్ర విచిత్రమైన విన్యాసాలు ప్రదర్శించే కళాకారులు, విదూషకులు, సుశిక్షితమైన జంతువుల బృందం లేదా ఆ బృందం ఇచ్చే ప్రదర్శనలు ఫిలిప్ ఆస్ట్లీ అనే ఆయనను ఆధునిక సర్కస్ కు పితామహుడిగా భావిస్తారు. 1768లో ఫిలిప్ గుర్రపు స్వారీలో నైపుణ్యుడు కాగా అయన గుర్రం మీద అనేక రకమైన విన్యాసాలు చేస్తూ థేమ్స్ నది ఒడ్డున ఉన్న ఒక మైదానంలో అందరికోసం ప్రదర్శన ఇచ్చేవాడట. 1770లో ఈయన తాను చేసే స్వారీ ప్రదర్శనల మధ్యలో జనాలను వినోదపరచడం కోసం జిమ్నాస్టిక్ లేదా దొమ్మరి విన్యాసాలు చేసేవాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

(Santhosh, News 18, Warangal)

సర్కస్ అంటే ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రయాణిస్తూ సందర్శకుల కోసం చిత్ర విచిత్రమైన విన్యాసాలు ప్రదర్శించే కళాకారులు, విదూషకులు, సుశిక్షితమైన జంతువుల బృందం లేదా ఆ బృందం ఇచ్చే ప్రదర్శనలు ఫిలిప్ ఆస్ట్లీ అనే ఆయనను ఆధునిక సర్కస్ కు పితామహుడిగా భావిస్తారు. 1768లో ఫిలిప్ గుర్రపు స్వారీలో నైపుణ్యుడు కాగా అయన గుర్రం మీద అనేక రకమైన విన్యాసాలు చేస్తూ థేమ్స్ నది ఒడ్డున ఉన్న ఒక మైదానంలో అందరికోసం ప్రదర్శన ఇచ్చేవాడట. 1770లో ఈయన తాను చేసే స్వారీ ప్రదర్శనల మధ్యలో జనాలను వినోదపరచడం కోసం జిమ్నాస్టిక్ లేదా దొమ్మరి విన్యాసాలు చేసేవాడు.

తాడు మీద నడిచేవాడు. అనేక వస్తువులను గాలిలోకి విసిరి నేర్పుగా పట్టుకోవడం చేసే వాడట. విచిత్ర వేషధారణలతో నవ్వించే విదూషకులు వంటి వారిని తన బృందంలో చేర్చుకున్నాడు. ఇదే విధానాన్ని తర్వాతి కాలంలో సర్కస్ అని పిలవడం ప్రారంభించారు. అలా సర్కస్ లేక దొమ్మరాట కొంతమందికి కుల వృత్తిగా మారింది. కర్నూల్ జిల్లాకు చెందిన యువరాజ్ అనే వ్యక్తి తన కుటుంబం పోషణ కోసం ఊరూరా తిరుగుతూ విచిత్రమైన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల వరంగల్ కు తన బృందంతో వచ్చాడు. యువరాజ్ తన భార్యతో కలిసి ఈ విన్యాసాలు చేస్తాడు. తనకి ఇద్దరు పిల్లలు కాగా.. వారి కుటుంబాన్ని పోషించుకోవడాని ఈ ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తాడు.

Rajanna Sricilla: జనవరి 15 లోగా మన ఊరు- మన బడి పనులు పూర్తి చేయాల్సిందే!

వరంగల్ కేంద్రంలోని పలు కాలనీలలో సర్కస్ ఫీట్లతో జనాలను ఆకట్టుకున్నాడు. వారి కష్టాన్నిచూసి ప్రేక్షకులు అధికమొత్తంలో డబ్బులు ఇస్తున్నారు. మరి కొంతమంది బియ్యం, కిరాణా సామానులు, వారి పిల్లలకు వేసుకోవడానికి బట్టలను ఇచ్చారు. వీరబ్రహ్మేంద్ర స్వామి పేరు మీద మూడు రోజుల సర్కస్ ఫీట్లు ఉంటాయి. మొదటి రోజుసైకిల్, బైక్ , ట్రాక్టర్ పై విన్యాసాలు చేస్తారు. తానూ కింద పడుకొని బైకులను ట్రాక్టర్లను తన పై నుంచి వాహనాలు వెళ్తాయి. నోటిలో పెట్రోల్ పోసుకొని ఫైరింగ్ సాహసాలు చేస్తాడు. చివరి రోజు వాళ్ళతో ఉండే ఒక అమ్మాయిని ముడు గంటల పాటు ఒక గొయ్యి తీసి జీవ సమాధి చేస్తారు.

మూడు గంటలు ముగిసిన తరవాత మళ్ళీ ఆ అమ్మాయిని బయటకు తీస్తారు. ఈ లాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేసేటప్పుడు అనేక గాయాలు కూడా అవుతాయి. అయితే, వీరికి మరొక విద్య తెలియక తామేమి చేయలేమంటున్నారు. వీళ్ళు దేశంలోని అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. పొట్ట కూటి కోసం భయంలేకుండా వీరబ్రహ్మేంద్ర స్వామిపై భారం వేసి ఇలాంటి విన్యాసాలు చేస్తానంటున్నాడు సర్కస్ యువరాజ్.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు