మన దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై హత్యలు (Murder), అత్యాచారాలు (Rapes) ఆగడం లేదు. నిర్భయ (Nirbhaya) , దిశ (Disha) లాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం చలనం రావడం లేదు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా… కొందరు రాక్షసుల్లో మార్పు రావడం లేదు. ఆరు నెలల పాప నుంచి నూట ఆరేళ్ల పండు ముసలవ్వ వరకు ఎవరినీ వదలడం లేదు. అంతే కాకుండా ఈ మధ్య సామూహిక లైంగిక దాడులు (gang rape) ఎక్కువ అయ్యాయి. జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామనడమో.. సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియా (Social Media) లో పోస్ట్ చేస్తామనడమో ఎదో ఒకటి చెప్పి వాళ్లను బెదిరించి లొంగదీసుకుంటున్నారు. ఇక మరికొందరైతే అధికారం చేతిలో ఉందికదా అని అత్యాచారాలకు తెగబడుతున్నారు. ఇలాంటి ఘటనే వరంగల్ (Warangal )లో జరిగింది. అతడో ప్రభుత్వ ఉద్యోగి (Government Employee). ఆ దుర్మార్గుడు.. ఓ వివాహిత మీద కన్నేశాడు. పొలాల్లోకి (farm) లాక్కెళ్లి.. అత్యాచారయత్నం చేశాడు (Tried to rape). ఇక, మహిళ గట్టిగా కేకలు వేయడంతో.. భార్యను కాపాడేందుకు ఆమె భర్త వెళ్లాడు. దీంతో బాధితురాలి భర్త (Husband) మీద దాడి చేశాడు కామాంధుడు. అతడిని తీవ్రంగా గాయపర్చి, అక్కడి నుంచి పరారయ్యాడు.
హోటల్ కు వెళ్లి..
వరంగల్ (Warangal )జిల్లా రాయపర్తి మండలం కొండాపూర్లో ఘటన జరిగింది. కొండాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గ్రామశివారులో బిర్యానీ హోటల్ (Biryani Hotel) పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామంలో వీఆర్ఏ (VRA)గా పనిచేస్తున్న అశోక్ శ్రీనివాస్ భార్యపై కన్నేశాడు. హోటల్ కు వెళ్లి శ్రీనివాస్ భార్యను పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి యత్నించాడు (Attempt to Rape). ఆమె కేకలు వేడంతో అది విన్న ఆమె భర్త శ్రీనివాస్.. అశోక్ ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. అదే క్రమంలో శ్రీనివాస్ చేతి వేలు తెగిపడేలా కొరికిన అశోక్ (Ashok)..ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు.
రాత్రి 9 గంటల సమయంలో..
బాధితుని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై బాధితుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘ కొండాపూర్ గ్రామ శివారులో బిర్యానీ హోటల్ నడుపుతున్నాను.. నిన్న రాత్రి 9 గంటల సమయంలో అశోక్ అనే వ్యక్తి మా హోటల్ కు వచ్చి నా భార్యను పొలాల్లోకి లాక్కొని పోయాడు. మద్యం మత్తులో నా భార్య మీద అసభ్యంగా (Misbehave) ప్రవర్తించారు. నేను అతడిని గల్లా పట్టుకోగా నా వేలిని పూర్తిగా కొరికి పారిపోయాడు. ఇలాంటివి పునరావృతం కాకుండా.. పోలీసులు అతడిని జైల్లో పెట్టాలి”అని డిమాండ్ చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Rape attempt, Warangal