హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: ఆ పెద్దాస్పత్రిలో విలువైన పరికరాలు మాయం...ఇంతకు ఏమౌతున్నట్లు?

Warangal: ఆ పెద్దాస్పత్రిలో విలువైన పరికరాలు మాయం...ఇంతకు ఏమౌతున్నట్లు?

X
వరంగల్

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో విలువైన పరికరాలు మాయం

Warangal: వరంగల్ లో ఉన్న ఎంజీఎం పెద్దాఆస్పత్రి ఇంటి దొంగలకు నిలయంగా మారుతుందా..? అంటే అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రాష్ట్రంలోనే హైదరాబాద్ (Hyderabad) తరువాత అంతటి నగరం వరంగల్ (Warangal) ఒక చారిత్రాత్మక నగరం ప్రతి రోజు వేలాదిగా సంఖ్యలో టూరిస్టులు నగరానికి వాస్తు ఉంటారు.ఇంతటి మహా నగరంలో అత్యాధునిక పరికరాలతో ప్రజల ఆరోగ్య నిమిత్తం ఎంజీఎం ఆసుపతి ఉంది కానీ తరుచు ఆసుపత్రిలో ఏదో ఒక సంఘటన చోటుచేసుకుంటుంది. ఎమర్జెన్సీ వార్డులో ఎలుక పేషెంట్‌ను కరవడం మరొకసారి పాము ఆసుపత్రి లోపటికి రావడంతో వైద్యం నిమిత్తం వచ్చిన ప్రజలకు చేదు అనుభూతిని చూపిస్తున్నాయి.

ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంతలోనే మరొక ఘటన వెలుగులోకి వచ్చింది వరంగల్ మహాత్మ గాంధీ మెమోరియల్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ విభాగంలో ఉన్న సుమారు నలభై లక్షల విలువచేసే ఏసీలు ,వెంటిలేటర్లు ఇతర వస్తువులు మాయమయ్యాయి ...అయితే ఈ విషయంపై అధికారులు ఎలాంటి స్పష్టతఇవ్వక పోవడం విశేషం .....

తరుచు ఇలాంటి సంఘటనలు జరగడంపై ప్రజాధనం నష్టమౌతోందని గతంలో కరోనా సమయంలో పీఎం నిధి నుంచి అనేక వెంటిలేటర్లు వచ్చాయని వాటిని ఉపయోగించడం లేదని అధికారులు,ప్రజాప్రతినిధులు తక్షణమే చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ సూపరిడెంట్​ను వెంటనే సస్పెండ్ చేయాలనీ బీజేపీ నాయకులూ డిమాండ్ చేసారు.

వరంగల్ లో ఉన్న ఎంజీఎం పెద్దాఆస్పత్రి ఇంటి దొంగలకు నిలయంగా మారుతుందా..? అంటే అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి.ఎంజీఎంలో పనిచేస్తున్న కొంతమంది అస్పత్రిలో వున్న వస్తువులను తమ చేతివాటం బాగానే ప్రదర్శిస్తూ కొట్టి వేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.ఇప్పటి వరకు ఎంజీఎం హాస్పిటల్ లో సుమారుగా 40 లక్షల రూపాయల విలువచేసే వస్తువులు కనిపించకుండా పోయినట్లు తెలుస్తుంది. విలువైన వస్తువులు వాటితో పాటు వైద్యం ఉపకరణాలు కనిపించకుండా పోయినట్లు ఎంజీఎంలో ప్రచారం జరుగుతుంది.

ఈ విలువైన వస్తువులు ఎత్తుకెళ్లడం బయటి వ్యక్తులకు ఎవరికి సాధ్యం కాదు కనుక ఇది కచ్చితంగా ఎంజీఎంలో పనిచేస్తున్న ఇంటి దొంగల పనేనని అనుమానిస్తున్నారు. మాయమైన ఖరీదైన వస్తువులకు సంబంధించి ఎంజీఎం హాస్పిటల్ సూపర్డెంట్ గుట్టు చప్పుడు కాకుండా మట్టేవాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.

First published:

Tags: Local News, Telangana, Telangana News, Warangal

ఉత్తమ కథలు