హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: సగం పనులైన వైకుంఠధామాలు.. పూర్తి డబ్బు వసూలు!

Warangal: సగం పనులైన వైకుంఠధామాలు.. పూర్తి డబ్బు వసూలు!

X
vaikunta

vaikunta dhamam

మనిషి చనిపోతే ఎక్కడ దహనం చేయాలో తెలియక నిరుపేదలు చెరువులు, వాగులు, కాలువలు దగ్గర ఎక్కడ స్థలం దొరికితే అక్కడ దుర్భరమైన పరిస్థితుల్లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India

రిపోర్టర్ : సంతోష్ కుమార్

లొకేషన్ : వరంగల్

మరణం తరువాత ప్రతి మనిషి అంత్యక్రియలు సంప్రదాయంగా జరగాలని.. గౌరవప్రదమైన పద్దతిలో చివరి మజిలీ ఒక నిర్దేశిత ప్రదేశంలో జరగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నీ గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం చేపట్టింది. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లాలోని గ్రామ పంచాయితీలకు వైకుంఠధామాలు మంజూరు చేసింది. కానీ జిల్లాలో ఇప్పటికీ కొన్ని చోట్ల వైకుంఠధామాలు పూర్తి కాలేదు. పూర్తి చేసిన వాటిలో సగం పనులు చేసి వదిలిపెట్టారు. మరి మిగతావి పూర్తయ్యేదెప్పుడు? అందుబాటులోకి వచ్చేది ఎప్పుడు? అంటూ ప్రజలు, ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు.

మనిషి చనిపోతే ఎక్కడ దహనం చేయాలో తెలియక నిరుపేదలు చెరువులు, వాగులు, కాలువలు దగ్గర ఎక్కడ స్థలం దొరికితే అక్కడ దుర్భరమైన పరిస్థితుల్లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. చివరి మజిలీ అయినా చక్కగా చేద్దామంటే సొంత భూమి లేక చాలామంది అంత్యక్రియలు ఎక్కడపడితే అక్కడ చేస్తున్నారు. కనీసం పట్టణాలలో అయినాస్మశానవాటికలు ఉండటం వల్ల పట్టణ ప్రజల చివరి మజిలీ గౌరవప్రదంగా అవుతుందనుకుంటే ఇక్కడి పరిస్థితి అంతే. స్మశానవాటికలు ఉన్నా.. వాటిలో కనీస వసతులు ఉండవు. కనీసం దహన సంస్కారం అనంతరం స్నానాలు చేసేందుకు నీటి సదుపాయం ఉండదు. మహిళలు బట్టలు మార్చుకోవడానికి బాత్రూములు ఉండవు.

ఒకపక్క కాష్టం కాలుతుంటే చుట్టుపక్కల ఉన్న పందులు, కుక్కలు వాటిని చెల్లా చెదారం చేస్తాయి. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది పందులను పంపించే ప్రయత్నం చేస్తే పందుల పెంపకదారులు వారిని బెదిరింపులులకు గురి చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా తమ కష్టాలను అధికారులు గుర్తించాలని స్థానికులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన వైకుంఠధామాలు అంతంత మాత్రమే ఉంటున్నాయి. సొంతంగా స్వచ్ఛంద సంస్థల వారు నిర్మించుకునే వైకుంఠధామాలు అన్ని సదుపాయాలతో నిర్మించుకుంటున్నారని, కనీసం ఇప్పటికైనా తమ కష్టాలను బల్దియా అధికారులు, ప్రజాప్రతినిధులు పరిష్కరించాలని ప్రజలు, ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

First published:

Tags: Local News, WARANGAL DISTRICT

ఉత్తమ కథలు