(P.Srinivas,New18,Karimnagar)
వరకట్న వేధింపులు తాళలేక వరంగల్(Warangal)జిల్లాలో మరో యువతి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించడం సంచలనం రేపింది. ఖానాపూర్(Khanapur)మండల కేంద్రానికి చెందిన యువతి నూర్జహాన్Noorjahan పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఏడాది క్రితం శరత్(Sharat) అనే వ్యక్తిని మతాంతర వివాహం చేసుకుంది నూర్జహాన్. హైదరాబాద్(Hyderabad)లో కొద్ది రోజులు ఉన్నారు. అనంతరం వరంగల్ చేరుకున్న తర్వాత నూర్జహాన్‌కి భర్త, అత్తమామలతో పాటు మెట్టినింట్లో వరకట్న వేధింపులు(Dowry Harassment) మొదలయ్యాయి.
కట్నం కోసం కాల్చుకు తిన్నారు..
భర్త శరత్‌తో పాటు అత్తమామలు వేధింపులు భరించలేకపోయిన బాధితురాలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అయితే పోలీసులు అత్తమామల దగ్గర లంచం తీసుకొని తన బాధ పట్టించుకోకపోవడంతో తీవ్రమనస్తాపానికి గురైంది. బ్రతికి ఉండి భర్త, అత్తమామల చేతిలో ఇబ్బంది పడటం కంటే చావడం మేలనుకొని పురుగుల మందు తాగింది. అంతకు ముందు భర్త, అత్తమామలే తనను వేధిస్తున్నారని సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తనకు జరిగినట్లుగా మరే ఆడపిల్లకు జరగకూడదని ఆవేదనతో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసింది.
వివాహిత ఆత్మహత్యాయత్నం..
పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేసిన బాధితురాలిని వెంటేనే వరంగల్‌లోని ఎంజీఎంకి తరలించారు ఆమె బంధువులు. ప్రస్తుతం ఆమె పరిస్ధితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు, డాక్టర్లు తెలిపారు. ఇష్టపడి వివాహం చేసుకున్న తర్వాత కట్నం కావాలని పదే పదే వేధించడం వల్లే నూర్జహాన్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గతంలో కట్నం తేలేదనే కారణంతో రెండు సార్లు ఆమెకు అబార్షన్ కూడా చేయించారని బాధితురాలి మేనమాన మీడియాతో చెప్పుకున్నాడు. ఈవిషయంలో నూర్జహాన్ ప్రాణాలకు ఏమైనా జరిగితే భర్త, అత్తమామలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.