హోమ్ /వార్తలు /తెలంగాణ /

వాళ్ల చదువులు హై క్లాస్.. పనులు మాత్రం లోక్లాస్.. ఆ బలహీనతే కారణం..!

వాళ్ల చదువులు హై క్లాస్.. పనులు మాత్రం లోక్లాస్.. ఆ బలహీనతే కారణం..!

వరంగల్‌లో దొంగల అరెస్ట్

వరంగల్‌లో దొంగల అరెస్ట్

వారిద్దరూ స్నేహితులు. ఒకరు ఇంజనీరింగ్ మరొకరు చాటెడ్ అకౌంట్ చదువుతున్నారు. జల్సాలకు అలవాటు పడి అప్పులపాలైన ఇద్దరూ సులువుగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో గొలుసు చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Telangana

Santosh, News18, Warangal

వారిద్దరూ స్నేహితులు. ఒకరు ఇంజనీరింగ్ మరొకరు చాటెడ్ అకౌంట్ చదువుతున్నారు. జల్సాలకు అలవాటు పడి అప్పులపాలైన ఇద్దరూ సులువుగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో గొలుసు చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. వరంగల్ జిల్లా (Warangal District) దుగ్గొండి మండలం చల పరికి చెందిన ముసుకు రాకేష్ , పగిళ్ల అఖిల్ చిన్ననాటి నుంచి స్నేహితులు. పదేళ్లక్రితం అఖిల్ కుటుంబం మహబూబాబాద్ జిల్లా (Mahbubabad District) కొత్త గూడ మండలం గాంధీనగర్ కు వలస వెళ్లారు. ఊళ్లో ఇంటర్ వరకు చదివిన రాకేష్ ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చి చైతన్యపురిలోని ఉంటూ ఓ హాస్టల్లో చిక్కడపల్లిలో సీఏ చదువుతున్నాడు. హయతనగర్ లోని ఓ కళాశాలలో బీటెక్ పూర్తిచేసిన అఖిల్ సైతం రాకేష్తో పాటే హాస్టల్లో ఉంటూ ఉద్యోగాన్వేషణ చేస్తున్నాడు.

అఖిల్ తండ్రి రెండేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. జల్సాల కోసం ఏడాదిగా క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న అందుకు కావలసిన సొమ్మును లోన్ యాప్ల ద్వారా తీసుకుంటూ.. బెట్టింగులకు ఖర్చు చేశాడు. మిగిలిందేమీ లేకపోగా.. అప్పులు కట్టా లంటూ ఒత్తిడి పెరగడంతో సులువుగా సంపాదించే దారులను యూట్యూబ్లో వెతికారు. చైన్ స్నాచింగులను పోలీసుల కంట్లో పడకుండా ఎలా చేయాలో తెలుసుకున్నారు. దానికి తమ పరిజ్ఞానాన్ని జోడించి రంగంలోకి దిగారు.

ఇది చదవండి: ఈ పాప కాలు కదిపితే రికార్డుల మోతే.. జానపదానికి కేరాఫ్ అడ్రస్

ఉప్పల్, బోడుప్పల్లో చేసిన మొదటి రెండు స్నాచింగ్లలో దొరికినవి గిల్టు నగలు కావడంతో అవాక్కయ్యారు. ఆపై వాటిని తమ వద్దే ఉంచుకుని తర్వాత చోరీ చేసిన నగలను వీటితో పోల్చుకోసాగారు. రాకేష్ కు అన్న కొనిచ్చిన హోండా ఆక్టివాపై చోరీకి బయలుదేరతారు. కూరగాయల సంతలు ఉన్న ప్రాంతాలను ఎంచుకుంటారు ఒకరు వాహనాన్ని కొద్దిదూరంలో స్టార్ట్ చేసి వేచి ఉంటే.. మరొకరు టార్గెట్ చేసిన వ్యక్తిని వెంబడించి మెడలోని గొలుసును తెంచుకోగానే పరారవుతారు.

ఇది చదవండి: నమ్మకానికి సైన్స్ కి తేడా ఇదే..! ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం..!

సీసీ కెమెరాలను తప్పించుకునేందుకు చిన్నచిన్న గల్లీలను ఎంచుకుంటారు . కెమెరాల్లో పడకుండా పోలీసుల దృష్టిని మళ్లించారు ఓ సీసీ కెమెరాలో ఫుటేజీని పరిశీలిస్తుండగా.. నిందితుడు చొక్కా మార్చి మరో రంగు చొక్కా వేసుకుంటూ కనిపించింది. సుమారు 100 కెమెరాలు. పరిశీలించి... అంబర్పేట ప్రేమనగర్ లోని ఓ ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులకు అక్కడ నిందితులు వాడిన వాహనం కనిపించింది. స్నేహితుడిని కలి సేందుకు వచ్చిన రాకేష్ ఆ ఇంట్లో నుంచి వస్తూ: మఫ్టీలో ఉన్న పోలీసులకు చిక్కాడు. తర్వాత మరో నిందితుడు అఖిల్నీ అరెస్టుచేసిన పోలీసులు 10తులాల బంగారాన్ని, బైకును స్వాధీనం చేసుకున్నారు.

First published:

Tags: Local News, Telangana, Theft, Warangal

ఉత్తమ కథలు