హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: మృత్యువులోను వీడని ఇద్దరి స్నేహబంధం ...

Warangal: మృత్యువులోను వీడని ఇద్దరి స్నేహబంధం ...

ప్రమాదంలో చనిపోయిన స్నేహితులు

ప్రమాదంలో చనిపోయిన స్నేహితులు

Telangana: వీరిద్దరూ చిన్నతనం నుండి ప్రాణ స్నేహితులు. గ్రామంలో వీరిద్దరి స్నేహాన్ని చూసి అందరు అసూయపడేలా ఉండేవారట.ఈ రోజుల్లో ఒక్క కడుపునపుట్టిన అన్నదమ్ములు,అక్క చెల్లెల్లు బాంధవ్యాలు మరచిపోయి ఆస్తుల కోసం చిన్న చిన్న విషయాలకు గొడవలు పెట్టుకుంటున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

(Santhosh, News 18, Warangal)

వీరిద్దరూ చిన్నతనం నుండి ప్రాణ స్నేహితులు. గ్రామంలో వీరిద్దరి స్నేహాన్ని చూసి అందరు అసూయపడేలా ఉండేవారట.ఈ రోజుల్లో ఒక్క కడుపునపుట్టిన అన్నదమ్ములు,అక్క చెల్లెల్లు బాంధవ్యాలు మరచిపోయి ఆస్తుల కోసం చిన్న చిన్న విషయాలకు గొడవలు పెట్టుకుంటున్నారు. కానీ చిన్నతనం నుండి పడవ తరగతి వరకు చదువుకున్న ఇద్దరి ప్రాణ మిత్రులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలని వదిలారు. వీరిద్దరూ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన ఘటన జనగాం జిల్లా కొడకండ్ల మండలం గిర్నీ తండా గ్రామా శివారులో చోటు చేసుకుంది .

పోలీసుల తెలిపిన వివారాల ప్రకారం ... సూర్యపేట జిల్లా నగరం మండలం ఫణిగిరి గ్రామానికి చెందిన ప్రశాంత్ (19)బొద్దు నవీన్ (20 ) హీరో గ్లామర్ బండి పై జనగాం వైపు వెళ్తున్నారు ఈ క్రమంలో గిర్నీ తండా వద్ద ఎదురుగావస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో దానితో బైక్ పై ఉన్నవారిద్దరూ ఎగిరిపడ్డారు. ఇద్దరి తలలకు బలమైన గాయాలు కావడంతో తీవ్ర రక్త స్రావం కావడంతో ఇద్దరి స్నేహితులు అక్కడిక్కడే మృతిచెందారు.

స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు .బాధితుల కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతుదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగాంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ కొమురవెల్లి తెలిపారు. ఓ వైపు కొడుకులని కోల్పోయిన నవీన్, ప్రశాంత్, కుటుంబసభ్యుల ఇళ్లలో, చిన్నతనం నుండి కలిసి చదువుకున్న ఇద్దరు స్నేహితులు మరణించడం గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి .

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు