హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: పేరుకే ఆర్ఎంపీ.. చేసేది మాత్రం ఎంబీబీఎస్ వైద్యం..

Warangal: పేరుకే ఆర్ఎంపీ.. చేసేది మాత్రం ఎంబీబీఎస్ వైద్యం..

ఆర్ఎంపీ నిర్లక్ష్యానికి వృద్ధుడు బలి

ఆర్ఎంపీ నిర్లక్ష్యానికి వృద్ధుడు బలి

Warangal: పల్లెల్లో పూర్తిస్థాయి డాక్టర్లు అందుబాటులో ఉండరు. అందుకే స్థానికంగా ఉండే ఆర్ఎంపీలే వారికి దిక్కు. వారి ఏం మందులు ఇస్తే అవే వేసుకోవాలి.. అది తప్ప వేరే గత్యంతరం ఉండదు. అలాంటి పరిస్థితులే కొన్నిసార్లు వారి ప్రాణాలమీదకు తెస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Telangana

Santosh, News18, Warangal

పల్లెల్లో పూర్తిస్థాయి డాక్టర్లు అందుబాటులో ఉండరు. అందుకే స్థానికంగా ఉండే ఆర్ఎంపీలే వారికి దిక్కు. వారి ఏం మందులు ఇస్తే అవే వేసుకోవాలి.. అది తప్ప వేరే గత్యంతరం ఉండదు. అలాంటి పరిస్థితులే కొన్నిసార్లు వారి ప్రాణాలమీదకు తెస్తున్నాయి. ఆర్‌ఎంపీ నిర్లక్ష్యంతో ఇంజక్షన్ వికటించి వృద్ధుడు బలయ్యాడు. అమాయక ప్రజల ప్రాణాలతో ఆటలుఆడుతున్నారు. తెలిసి తెలియని వైద్యం చేసిప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. ఫలితంగా కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు చావు వరకు వెళ్లి తిరిగి వస్తున్నారు. తాజాగా వరంగల్‌ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని పత్తిపాక తండాలో ఓ వ్యక్తికి ఆర్‌ఎంపీ చేసిన వైద్యం అతని ప్రాణాలపైకి తెచ్చింది. మండలంలోని ఆర్‌ఎంపీ నిర్వాకంతో ఓ వృధుడు ప్రాణాలు కోల్పోయాడు. పేరుకు ఆర్‌ఎంపీ వైద్యడే అయినా ఎంబీబీఎస్‌ వైద్యాన్నిచేస్తున్నప్పటికీ జిల్లా వైద్యాధికారులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది.

నెక్కొండ మండలం పత్తిపాక తండకు చెందిన బోడ రంజా అనే గిరిజనుడు గత నవంబర్‌ నెల 18 తేదీన బోడ రంజా (58 ) గుగులోతు మారు(42 ) విరిద్దరూ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని చికిత్స కోసం మండల కేంద్రంలోని ఉన్న అమృత ప్రధమ చికిత్స ఆలయం పేరుతో ఆస్పత్రి నడుపుతున్న రాజు అనే ఆర్ఎంపీ వద్దకి వెళ్లారు. అతను రెండు ఇంజక్షన్లు వేసి ఐదు రోజులకుగానూ మందులు ఇచ్చారని అలాగే ఆ గోళీలు ఉదయం ఏడు.. సాయంత్రం ఏడు వేసుకోవాలని సూచించాడు. అలా చేయడంతో మరుసటి రోజే వృదుడికి చర్మం మొత్తం నల్లగా మారి పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది మళ్లీ ఆర్‌ఎంపీని సంప్రదించగా అతను వేరే మందులు ఇస్తానని చెప్పడంతో అతని వైద్యంపై అనుమానాలు వచ్చాయి. వెంటనే పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.

ఇది చదవండి: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాదర్శకత కోసమే ఇదంతా..!

ఆర్ఎంపి ఇచ్చిన ఇంజక్షన్లు మందులతో రంజ్యా, మారు మొత్తం నల్లగా మారారని ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, తాండవాసులు, అంతా కలిసి సర్పంచ్‌ కీ జరిగిన సంగతి చెప్పారు. ఆర్‌.ఎంపీ దగ్గరికి సర్పంచ్‌ తో పాటు తండ వాసులు వెళ్లగా విషయం తెలుసుకున్న. ఆర్‌.ఎంపి డాక్టర్‌ రాజు పరారయ్యాడు. నెక్కొండ పోలీసులకు సమాచారం ఇచ్చి మెరుగైన వైద్యం కోసం నర్సంపేటలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

ఇది చదవండి: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై డెడ్ లైన్.. అధికారులకు కలెక్టర్ ఆదేశం

అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఎంఎన్.జే ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా ఫలితం లేకపోవడంతో ఉస్మానియాకు తీసుకెళ్లారు. ఉస్మానియా డాక్టర్లు చికిత్స చేసి ఇంటికి పంపగా.. ఇంటివద్దే అపస్మారక స్థితికి వెళ్లి మృతి చెందాడు. ఆర్ఎంపీ రాజు నిర్లక్ష్యంతోనే రంజా మృతి చెందాడని.. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు