హోమ్ /వార్తలు /తెలంగాణ /

రోడ్డుపక్కనే ట్రైన్.. అక్కడికి వెళ్తే అన్నీ ఘుమఘుమలే..!

రోడ్డుపక్కనే ట్రైన్.. అక్కడికి వెళ్తే అన్నీ ఘుమఘుమలే..!

X
వరంగల్

వరంగల్ లో ఆకట్టుకుంటున్న బీబీకీ రెస్టారెంట్

Warangal: రుచుల్లో ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కోలా ఉంటుంది. కొందరికి ఒక టిఫిన్ సెంటర్ నచ్చుతుంది. మరొకరు తమకు నచ్చిన హోటల్లో తప్ప మరో చోట భోజనం చేయరు. అందుకే వీరిని ఆకట్టుకోవడానికి కొందరు వినూత్నంగా ట్రై చేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Telangana

Santosh, News18, Warangal

రుచుల్లో ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కోలా ఉంటుంది. కొందరికి ఒక టిఫిన్ సెంటర్ నచ్చుతుంది. మరొకరు తమకు నచ్చిన హోటల్లో తప్ప మరో చోట భోజనం చేయరు. అందుకే వీరిని ఆకట్టుకోవడానికి కొందరు వినూత్నంగా ట్రై చేస్తున్నారు. వారి ప్రయత్నాలన్నీ కస్టమర్లను బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఫుడ్ కోర్ట్స్ , హోటల్స్ రెస్టారెంట్ల విషయంలో విషయం స్పష్టంగా కనిపిస్తోంది. వరంగల్ (Warangal) నగర ప్రజలను ఆకట్టుకుంటున్న వెరైటీ ఫుడ్స్ పై న్యూస్ 18 స్పెషల్ స్టోరీ..! వరంగల్ మహానగరంలో సరికొత్త ఫుడ్ కల్చర్ మొదలైంది నగరవాసులను ఆకట్టుకునేందుకు ఈ మధ్యకాలంలో నగరానికి బ్రాండెడ్ బిర్యాని సెంటర్లో క్యూ కడుతున్నాయి. ఒకవైపు బ్రాండెడ్ బిర్యానీ సెంటర్లో మంది బిర్యానీతోపాటు కొత్త తరహాలో హోటల్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

సరికొత్త థీమ్స్ తో ఇస్తున్న ఈ ఫుడ్ సెంటర్లకు భలే డిమాండ్ వస్తున్నాయి. ఓ వైపు జైలు థీమ్ తో మరో రెస్టారెంట్ ట్రైన్ థీమ్ తో నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. అయితే రొటీన్ కు భిన్నంగా ఉండాలన్న ఉద్దేశంతో చాలామంది యువత ఉన్నత చదువులు చదువుకొని కూడా సొంత వ్యాపారంపై మొగ్గుచూపుతున్నారు .కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాలకు శ్రీకారం చుడుతున్నారు.

ఇది చదవండి: భద్రాద్రి రామయ్య కల్యాణానికి కుదిరిన ముహూర్తం.. బ్రహ్మోత్సవాలు ఎప్పుడంటే..!

హనుమకొండ నయీంనగర్ కు చెందిన షకీల్ డిగ్రీ చదువుకున్నాడు హోటల్ మేనేజ్మెంట్ కూడా పూర్తి చేశారు. అనంతరం కొద్ది రోజులు రెస్టారెంట్లో పని పనిచేశాడు. అయితే తనకంటూ ఒక సొంత వ్యాపారం ఉండాలని నిర్ణయించుకొని కొత్త తరహాలో ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్న ఆలోచనతో బార్బీ క్యూ వ్యాపారాన్ని మొదలుపెట్టారు.

ఈ బార్బీ క్యూ తయారు చేసే పరికరాన్ని చూసినట్లయితే ఒక రైలింజన్ ఆకారంలో ఉండే దానిలా కనిపిస్తుంది. ముందు వైపున రైలింజన్ వెనుక వైపు వెళ్లి చూస్తే వేడివేడిగా బార్బీ క్యూ తయారు చేసే పరికరాలు ఉంటాయి. వీరి వద్ద చికెన్ టిక్కా, చికెన్ వింగ్స్, ఫిష్, చికెన్ బర్గర్, ఎన్నో ఐటెమ్స్లభిస్తాయి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా సరసమైన ధరలకు మంచి వెరైటీ ఫుడ్స్ నగరవాసులకు అందించాలని ఈ బార్బీ క్యూ వ్యాపారాన్ని మొదలు పెట్టానని అంటున్నాడు షకీల్.

First published:

Tags: Local News, Telangana, Warangal