హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఈ స్కూల్‌కి మంత్రివర్గం.. పిల్లలే మంత్రులు..! ఎక్కడుందంటే..!

ఈ స్కూల్‌కి మంత్రివర్గం.. పిల్లలే మంత్రులు..! ఎక్కడుందంటే..!

X
వరంగల్

వరంగల్ లో స్కూల్లోనే మంత్రివర్గం

Warangal: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రి వర్గాలను ఏర్పాటు చేయడం చూసాం కానీ స్కూళ్లలో స్టూడెంట్స్ కి మంత్రి వర్గాన్ని ఏర్పాటుచేయడాన్ని చూసారా? ఓ స్కూల్లో మాత్రం కేబినెట్ ఉంది.. మంత్రులున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Andhra Pradesh

Santosh, News18, Warangal

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రి వర్గాలను ఏర్పాటు చేయడం చూసాం కానీ స్కూళ్లలో స్టూడెంట్స్ కి మంత్రి వర్గాన్ని ఏర్పాటుచేయడాన్ని చూసారా? ఓ స్కూల్లో మాత్రం కేబినెట్ ఉంది.. మంత్రులున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రిన్సిపల్ వినూత్నంగా విద్యార్థుల్లో, సమాజంలో అవగాహనా బాధ్యత కలిగే విధంగా విద్యార్థులకు భవిషత్ లో న్యాయకత్వ లక్షణాలు పెంపొందించాలని తపనతో విద్యార్థులకు మంత్రివర్గం ఏర్పాటు చేశారు. చదువుల్లో ముందున్న వారిని ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నుకున్నారు. ఎంపికైనవారికి కేటాయించి పర్యవేక్షిస్తున్నారు. ఆ మంత్రి వర్గ విధులు ఏంటో ఎలా ఉంటాయో చూద్దాం.

ఓటింగ్ ద్వారా ఎంపికైన మంత్రులు ఎవరంటే ప్రధాన మంత్రి, ఉప ప్రధాన మంత్రి, ఆరోగ్య శాఖ, విద్య శాఖ, క్రీడా శాఖ, ఆహార శాఖ, క్రమశిక్షణ శాఖ మంత్రులు ఉన్నారు. ఒక్కో మంత్రి ఒక్కో విధులు నిర్వహిస్తారు ప్రధాన మంత్రి ఎప్పటికప్పుడు మంత్రులను సమీక్షిస్తుంది. ఉప ప్రధాన మంత్రి పాఠశాలని పరిశుభ్రంగా ఉండేలా చూడాలి. మొక్కలు నీరు పోయాలి.

ఇది చదవండి: చరిత్ర కలిగిన శిల్పకళా సంపద.. అభివృద్ధికి నోచుకోని ఖిల్లా వరంగల్

ఆరోగ్యశాఖ మంత్రి పాఠశాలలో ఎవరికైనా అనారోగ్య పరిస్థితి ఉంటె వెంటనే ప్రధాన ఉపాధ్యాయుడికి తెలియజేయాలి. మందులు ఇప్పించాలి. తీవ్రతగా వుంటే తల్లి తండ్రులకు తెలియజేయాలి. విద్యాశాఖ మంత్రి ఏం చేయాలంటే పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఎలా చుదువుతున్నారో పర్యవేక్షించాలి. క్రీడా శాఖ మంత్రి పనులు ఏంటంటే విద్యార్ధులందరిని ఆటలు ఆడించడం, డ్రిల్ల్ వంటి మార్చ్ ఫస్ట్ వంటివి చేయించడం.

ఇది చదవండి: పనికిరాని వస్తువులే ఒక ఆహ్లాదం.. ఆకర్షణీయం

ఆహార శాఖ మంత్రి విషయానికొస్తే పాఠశాలలో మధ్యాహ్నం భోజనం ఎలా వండుతున్నారో ఎలాంటి వంటలు చేస్తున్నారో అని తెలుసుకోవాలి.ఇక క్రమశిక్షణ శాఖ మంత్రి విషయానికివస్తే పాఠశాలలో ఉన్న విద్యార్థులందరిని క్రమశిక్షణలో ఉంచడం.

అయితే, విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం తోటి విద్యార్థుల్లో కూడా తాము మంచిగా చదువుకుంటే తమకు కూడా ఇలా మంత్రి వర్గంలో చోటు దక్కుతుందనే ఆలోచనతో చదువుతారని ఇలాంటివి చేయడం ద్వారా విద్యార్థులు ఆసక్తకరంగా ఉంటారని అంటున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్, విద్యార్థులు మాత్రం చాలా ఆసక్తితో తమ విధులను నిర్వహిస్తున్నామని.. నిజంగానే మంత్రి ఐనట్టుగా అనిపిస్తుందని విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు