Santosh, News18, Warangal
వరంగల్ జిల్లా (Warangal District) లోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంధాలయం ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. సకల సౌకర్యాలతో పోటీ పోటీపరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు, పుస్తక ప్రియులకు, విద్యార్థులకు వివిధ రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచుతుంది. 1964లో అప్పటి కలెక్టర్ నెలకొల్పిన ఈ గ్రంథాలయాన్నికేంద్ర ప్రభుత్వ ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులుతో రూ.2కోట్లతో అద్భుతంగా తీర్చిదిద్దారు. గ్రంథాలయానికి వచ్చే విద్యార్థులు, పాఠకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యాన్లు, కుర్చీలు ఏర్పాటు చేయడంతోపాటు ప్రశాంతమైన వాతావరణం కల్పించారు. కొత్త కొత్త పుస్తకాలను ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నట్లు చెప్పారు. కానీ సిబ్బంది తక్కువగా ఉండడంతో ఇబ్బంది కరంగా ఉందని ఈ విషయంపై కలెక్టర్ కి దరఖాస్తు పెట్టామని లైబ్రేరియన్ అలివేలు పేర్కొన్నారు. ప్రసుతం గ్రంథాలయంలో 82వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.
స్మార్ట్ సిటీ నిధులతో నూతన హంగులతో నిర్మించిన ఈ గ్రంధాలయంలో మంచి పార్కు ఏర్పాటు చేసారు. కానీ చెట్ల నీరు పోసేవారు లేరు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చే పాఠకులు లేక విద్యార్థులు మొక్కలకి నీరు పోస్తారు. ఇక్కడ ఉన్న బాత్రూం, మంచినీటి సమస్యలు సిబ్బంది కొరతతో పర్యవేక్షణ కరువై సరిగా మెయింటేన్ చేయలేకపోన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు సెక్యూరిటీ ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా ఈ లైబ్రరీలో డిజిటల్ పనులు ఆగిపోయాయి. గ్రంథాలయానికి వచ్చే విద్యార్థులు, పాఠకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యాన్లు, కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రశాంతమైన వాతావరణం కల్పించారు.
కొత్త కొత్త పుస్తకాలను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తెస్తున్నారు. కానీ ఇంటర్నెట్ సదుపాయం లేక బయటవాటిపై ఆధారపడవలసి వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న లైబ్రరీకు వరంగల్ జిల్లా నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా సుమారు 400 మంది వరకు పాఠకులు, విద్యార్థులు వస్తుంటారు. ఎక్కువ శాతం మహిళలు వస్తారు. కనుక బాత్రూంల సదుపాయాలు సరిగా లేక ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే వారు పార్కింగ్ స్థలంలేకపోవడంతోసమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం చొరవతో ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించాలని పాఠకులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal