హోమ్ /వార్తలు /తెలంగాణ /

కొత్త తరహాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు.. రెండేళ్లకే దిగుబడి.. అది ఎలాగంటే..!

కొత్త తరహాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు.. రెండేళ్లకే దిగుబడి.. అది ఎలాగంటే..!

X
కొత్త

కొత్త తరహాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు

Warangal: ప్రస్తుతం వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇన్నాళ్లూ సాంప్రదాయ పంటలు మాత్రమే పండించే రైతులు.. ఇప్పుడు క్రమంగా అప్ డేట్ అవుతున్నారు. ఓవైపు సాంప్రదాయ సాగు చేస్తూనే మరోవైపు కమర్షియల్ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Telangana

Santosh, News18, Warangal

ప్రస్తుతం వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇన్నాళ్లూ సాంప్రదాయ పంటలు మాత్రమే పండించే రైతులు.. ఇప్పుడు క్రమంగా అప్ డేట్ అవుతున్నారు. ఓవైపు సాంప్రదాయ సాగు చేస్తూనే మరోవైపు కమర్షియల్ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగా విదేశాల్లో పండే పంటలను కూడా ఇక్కడ సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. అలాంటి పంటల్లో ముఖ్యమైనది డ్రాగన్ ఫ్రూట్. ఇప్పటివరకు విదేశాలతో పాటు ఇతర రాష్ట్రాలకే పరిమితమైన డ్రాగన్ ఫ్రూట్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఓ రైతు ఆధునిక పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు.

సాధారణంగా డ్రాగన్ ఫ్రూట్ పంట చేతికి రావాలంటే మూడు, నాలుగు సంవత్సరాలు పడుతుంది. దీంతో పెట్టుబడి విషయంలో రైతులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యం లో కొందరు రైతులు రెండేళ్లలో దిగుబడులు వచ్చేలా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అంటే చాలా డిమాండ్ ఉండేది. అందుకే రైతులు తెలుగు రాష్ట్రాల్లోసాగు చేపట్టారు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఎకరాలోనో అరా ఎకరాలోనో డ్రాగన్ ఫ్రూట్ సాగు కనబడుతూనే ఉంది.

ఇది చదవండి: 80ఏళ్లుగా ఆ గ్రామానికి రోడ్డులేదు.. జనం ఇబ్బందులు ఇంతింతకాదయా..!

మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ దిగుబడులు పెరిగిపోతున్నందున.. పెట్టుబడిని త్వరగా పొందేందుకు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామానికి చెంది శంకర్ అనే రైతు కొత్త పద్ధతిని అవలంభిస్తున్నాడు. తనకున్న కేవలం పది గుంటల భూమిలో డ్రాగన్ ఫ్రూట్ వేసిన శంకర్.. దిగుబడి కోసం నాలుగేళ్లు ఎదురుచూడకుండా ట్రెల్లిస్ అనే పద్ధతిని ఫాలో అవుతున్నాడు. ఇంటర్నెట్లో ట్రెల్లిస్ పద్ధతి గురించి తెలుసుకొని సాగు చేస్తున్నాడు. దీంతో సాగు ఖర్చు తక్కువ అవడంతో పాటు దిగుబడి మెరుగ్గా ఉందని పేర్కొన్నాడు.

ట్రేల్లీస్ పద్దతి..

అసలు ట్రెల్లిస్ పద్ధతిలో ఒక ఎకరా భూమిలో కొన్ని వెదురు బొంగులు లేదా స్తంభాలు పాతుకొని ఒక్కో బొంగు కు నాలుగు మొక్కలను నాటుకుంటారు. ఇలా ఒక ఎకరాకు సుమారుగా ఒక 100 బొంగుల వరకు పాతుకోవచ్చు ఇలా చేయడం వల్ల మంచి పంటతో పాటు అధిక దిగుబడితో లాభాలు సమకూరుతాయి అంటున్నాడు రైతు. ఎకరాకు 500 స్తంభాలు అవసరమవుతాయంటున్నారు. ఒక్కో స్తంభం వద్ద నాలుగు మెుక్కలను నాటుకోవాలి. దీనినే ట్రేల్లీస్ పద్దతి అంటారు. మెుక్కకు సరిపడ పశువుల పేడను ఎరువుగా వేస్తూ ఉంటే అధికమైన దిగుబడిని పొందవచ్చు. సాధారణ డ్రాగన్ ఫ్రూట్ సాగుతో పోల్చుకుంటే ఇప్పటవరు పెట్టుబడి తక్కువగానే అయిందని.. దిగుబడి వచ్చిన తర్వాత లాభాలు పెరుగుతాయని ఆశిస్తున్నట్లు రైతు శంకర్ అంటున్నాడు.

First published:

Tags: Agriculture, Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు