హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: పార్కింగ్‌లో ఉంచిన బైక్‌లే టార్గెట్., పోలీసులకు అలా దొరికిపోయాడు

Mulugu: పార్కింగ్‌లో ఉంచిన బైక్‌లే టార్గెట్., పోలీసులకు అలా దొరికిపోయాడు

వరంగల్‌లో బైక్ దొంగల అరెస్ట్

వరంగల్‌లో బైక్ దొంగల అరెస్ట్

ఇళ్లలో పక్కగా తాళాలేసి దాచుకున్న సొమ్ముకే దిక్కుండటం లేదు. సీసీ కెమెరాల నిఘాలో ఉన్న బ్యాంకులకే కేటుగాళ్లు కన్నం వేస్తున్నారు. అలాంటిది రోడ్డుపక్కన బైక్‌లు పెడితే ఊరుకుంటారా.. తమలోని టాలెంట్ అంతా ప్రదర్శించి ఎంచక్కా ఎత్తుకెళ్లిపోతుంటారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  Venu, News18, Mulugu

  ఇళ్లలో పక్కగా తాళాలేసి దాచుకున్న సొమ్ముకే దిక్కుండటం లేదు. సీసీ కెమెరాల నిఘాలో ఉన్న బ్యాంకులకే కేటుగాళ్లు కన్నం వేస్తున్నారు. అలాంటిది రోడ్డుపక్కన బైక్‌లు పెడితే ఊరుకుంటారా.. తమలోని టాలెంట్ అంతా ప్రదర్శించి ఎంచక్కా ఎత్తుకెళ్లిపోతుంటారు. తెలంగాణ (Telangana) లోని వరంగల్ జిల్లా (Warangal) లో ఇలాంటి దొంగతనాలే తరచూ జరుగుతున్నాయి. కాజీపేట కేంద్రానికి చెందిన యోగి ఒక ప్రైవేట్ మిల్క్ సెంటర్లో ఉద్యోగం చేస్తున్నాడు. రోజు దర్గాబంధం చెరువు వద్ద తన పల్సర్ బైక్‌ని పార్క్ చేసి విధులకు వెళ్తుంటాడు. అదేవిధంగా ఈనెల 17వ తారీఖున ఎప్పటిలాగే యోగి రోజు తన బైక్‌ను పార్కింగ్‌లో పెట్టి డ్యూటీకి వెళ్ళిపోయాడు. విధులు నిర్వహించుకొని సాయంత్రం బైక్ కోసం వచ్చిన యోగికి అక్కడ బైక్ కనిపించలేదు.

  దీంతో యోగి ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఏం చేయాలో తెలియక వెంటనే పోలీసులను సంప్రదించాడు. ఈ తరహాలోనే శాంతినగర్‌లో ప్రకాష్ అనే వ్యక్తి 12వ తేదీన రాత్రి తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి వద్ద పార్క్ చేసి ఉంచగా... తెల్లవారే సరికి ఇంటిముందు పార్క్ చేసిన బైక్ మాయమైంది. ప్రకాష్ కూడా పోలీసులను ఆశ్రయించాడు.

  ఇది చదవండి: కిడ్నాప్ అయిన గిరిజన విద్యార్థిని కేసులో సంచలన ట్విస్ట్.. అసలేం జరిగింది..?

  రోజుల వ్యవధిలోనే ఇలా బైక్ దొంగతనాలు జరగడంపై పోలీసులు బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించి వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు. సీఐ గట్ల మహేందర్ రెడ్డి.. బైక్ దొంగలను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాడు. ఇంతలో శాంతినగర్‌లో అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అసలు విషయం బయటపడింది. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అతని పేరు కల్లపు శివ. భువనగిరి జిల్లా న్యూ రాంనగర్ లో నివసిస్తున్నాడు. సొంతూరు ధర్మసాగరం అని పోలీసు విచారణలో తేలింది.

  బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు శివ పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఈ ద్విచక్ర వాహనాల చోరీల్లో శివ స్నేహితుడు అనిల్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శివ అనిల్ జల్సాలకు అలవాటు పడి, డబ్బులు సంపాదించేందుకు ఇలా పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీ చేయడం మొదలుపెట్టారు. దొంగిలించిన ద్విచక్ర వాహనాలను శాంతినగర్లో దాచిపెట్టేవాడు. ఆదివారం కావడంతో శివ ఒంటరిగానే మరో ద్విచక్ర వాహనాన్ని దొంగతనం చేయడానికి వచ్చినట్లు తెలిసింది. శివ నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న అనిల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Bike theft, Local News, Telangana, Warangal

  ఉత్తమ కథలు