హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: వృత్తి పరంగా వైద్యుడు, సామాజిక సేవలో పేదల పాలిట దేవుడు.., సేవతో ఆత్మ సంతృప్తి పొందుతున్న డాక్టర్

Warangal: వృత్తి పరంగా వైద్యుడు, సామాజిక సేవలో పేదల పాలిట దేవుడు.., సేవతో ఆత్మ సంతృప్తి పొందుతున్న డాక్టర్

X
పేదలకు

పేదలకు అండగా డాక్టర్ శ్రీనివాస్ వర్మ

డాక్టర్ (Doctor) అంటే వైద్యం చేయడమే కాదు, తన వద్దకు వచ్చే రోగుల స్థితిగతులు తెలుసుకుని వారికి మానసిక స్థైర్యాన్ని పెంపొందించి భరోసా ఇచ్చేవాడు వైద్యుడు. అలాంటి డాక్టర్‌ను దేవుడితో సమానంగా చూస్తారు ప్రజలు.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India

Santosh, News18, Warangal

డాక్టర్ (Doctor) అంటే వైద్యం చేయడమే కాదు, తన వద్దకు వచ్చే రోగుల స్థితిగతులు తెలుసుకుని వారికి మానసిక స్థైర్యాన్ని పెంపొందించి భరోసా ఇచ్చేవాడు వైద్యుడు. అలాంటి డాక్టర్‌ను దేవుడితో సమానంగా చూస్తారు ప్రజలు. అందుకే వైద్యో నారాయణోహరి అంటారు. వైద్యుడు దేవుడితో సమానమని చెప్పే వాక్యం ఇది. మనుషులకు వైద్యం పేరుతో కోట్ల రూపాయల వ్యాపారంగా సాగుతుంది వైద్య వ్యవస్థ. అటువంటిది ఏ వైద్యుడు మాత్రం తన వద్దకు వచ్చే రోగులకు ఉచిత వైద్యం అందించడంతో పాటు, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నాడు. వరంగల్ (Warangal) నగరానికి చెందిన వైద్యుడు శ్రీనివాస్ వర్మ ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు. స్వతహాగా వైద్యుడైన శ్రీనివాస్ వర్మ తన వద్దకు వచ్చే రోగులకు వైద్యం అందించడంతో పాటు, ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న నిరుపేద రోగులకు తన సొంత డబ్బుతో వైద్యం చేపిస్తున్నాడు.

వర్మ ఫౌండేషన్ పేరుతో వెల్ఫేర్ సొసైటీ, స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఎంతో మంది పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. స్వచ్చంద సేవలో భాగంగా ఉపాధి లేని వారిని కూడా ఆదుకుంటున్నాడు ఈ డాక్టర్. ఆశతోటి కాకుండా ఆశయంతో సమాజంలో పేదవారికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు డాక్టర్ శ్రీనివాస్ వర్మ తెలిపారు.

ఇది చదవండి: సులువుగా చిత్రాలు ఎలా గీయాలో నేర్పిస్తున్న మాస్టారు.., ఇంత ఈజీగా చిత్రాలు గీయవచ్చా?

కరోనా సమయంలో ఎంతో మంది అభాగ్యులను ఆదుకున్నారు. ఆసుపత్రుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, పేదలకు నిత్యవసర సరుకులు, ఉచిత వైద్యం అందించాడు. అంతేకాక కరోనా తర్వాత ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసి జీవనోపాధి కల్పించారు. డప్పు కళాకారులకు డప్పు వాయిద్యాలు, ఇతర కుల వృత్తుల వారికి అవసరమైన సహాయం అందించినట్లు వైద్యుడు శ్రీనివాస్ వర్మ చెప్పుకొచ్చాడు. అలా ఇప్పటి వరకు సుమారు రూ. 3 కోట్లు స్వచ్చంద సేవ కోసం ఖర్చు చేశానని తెలిపారు.

ఇది చదవండి: ఆర్టీఏ ఏజెంట్ల కొత్త మోసాలతో ప్రజలు బేజారు.., అధికారులు చెబుతున్న సూచనలు ఇవే..

తన స్వచ్చంద సంస్థకు వచ్చేవారికి చేతనైన సహాయం చేస్తున్నట్లు తెలిపారు. డబ్బులకు ఆశపడకుండా పేద వారికీ ఉచిత వైద్యం చేయడమే తన సంకల్పమని తెలిపారు. పోయేటప్పుడు ఏమి తీసుకెళ్లమని ఉన్నదాంట్లో అందరికీ సంతృప్తిగా ప్రేమని పంచడమే ముఖ్యమని అంటున్న ఈ వైద్యుడు ఇక ముందు కూడా తనకి తోచినంత సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని న్యూస్ 18తో అన్నారు.

First published:

Tags: Doctors, Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు