హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal Tourist place: మీరు బహుళ అంతస్తుల బావి ఎప్పుడైనా చూశారా..? అది మన వరంగల్‌లో..!

Warangal Tourist place: మీరు బహుళ అంతస్తుల బావి ఎప్పుడైనా చూశారా..? అది మన వరంగల్‌లో..!

X
బహుళ

బహుళ అంతస్తుల బావి

రాణి రుద్రమదేవి సినిమా చూస్తే మనకు అందులో ఒక రహస్య మార్గం నుండి రుద్రమదేవి ఒక కోనేరు వద్దకు వెళ్లి స్నానం ఆచరించి ఆ తరువాత అక్కడి నుండి ఒక ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటుంది. అలాంటి ప్రదేశం నిజంగా ఉందని మీకు తెలుసా? ఎక్కడో కాదు మన వరంగల్‌లోనే..

ఇంకా చదవండి ...

(Pranay Diddi, News 18, Warangal)

Warangal Tourist place: కాకతీయ సామ్రాజ్యంలో ఏ ప్రదేశానికి వెళ్లిన ఏదో ఒక చరిత్ర (History) ఉంటుంది. ప్రతి ప్రాంతానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి చరిత్ర ఉన్న అనేక ప్రదేశాలు ఓరుగల్లులో ఇప్పటికీ మనకు కనువిందు చేస్తూ ఉంటాయి. అందులో ఒకటైన బహుళ అంతస్తు బావి..అదేనండి మెట్లబావి.

ఒక్కసారి మీరు రాణి రుద్రమదేవి (Rani Rudrama Devi) సినిమాను చూశారా? రుద్రమదేవి రుద్ర దేవుడిగా ఉన్నప్పుడు పలు సందర్భాల్లో ఈ సినిమాలో రహస్యంగా ఒక ప్రదేశానికి వెళ్లి అక్కడ స్నానమాచరించడం అక్కడ కాలక్షేపం పొందుతూ ఉండటం మనం సినిమాలో చూశాం. అయితే అదంతా సినిమా కానీ.. నిజంగా ఆ రహస్య ప్రదేశం వరంగల్‌ (Warangal )లో ఉంది.. అదే ఈ బహుళ అంతస్తు బావి (Multi-storey well)..

బహుళ అంతస్తుల బావి..

ఓరుగల్లు (Warangal )కాకతీయ కళా సంపదకు కేరాఫ్ అడ్రస్ ముస్లిం రాజుల దాడులులో కొన్ని కళాఖండాలు ధ్వంసమైన ఆనాటి వైభవానికి ప్రతీకలుగా నిలిచిన కొన్ని కట్టడాలు దేశ విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటుంది.. కాకతీయులు కోటలు చెరువులకే కాదు బావిలకు కూడా ప్రాముఖ్యత ఇచ్చారు. ఖిలా వరంగల్‌లో కాకతీయులు నిర్మించిన బావులు 300కు పైగా ఉన్నాయని చరిత్రకారులు చెబుతారు.. అందులో బహుళ అంతస్తుల బావి ఒకటి. ఖిలా వరంగల్ కు అతి సమీపంలో ఉంది ఈ బహుళ అంతస్తుల బావి (Bahula anthasthula). ఈ బావి వెనక పెద్ద చరిత్ర దాగి ఉంది.

మూడంతస్తుల్లో బావి నిర్మాణం

ఓ పుస్తకం లో దొరికిన సమాచారంతో వారసత్వ కట్టడాలపై ప్రేమ ఉన్న వారు కొందరు ఈ బావి గురించి అందరికీ తెలియజేశారు. ఖిల వరంగల్ కోట నుండి ఈ బహుళ అంతస్తుల బావికి రహస్య మార్గం ఉంది. ఈ బావి మొత్తం మూడు అంతస్తుల్లో నిర్మాణం చేపట్టారు. కింద నుండి మొదటి అంతస్తులో స్నానం చేయడం, రెండవ అంతస్తులో వస్త్రాలు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు. చివరి అంతస్తులు పూజలు నిర్వహించేలాఈ బావి నిర్మించారు.

ఖిలా నుంచి సొరంగ మార్గం..

ఈ బహుళ అంతస్తు బావి (Multi-storey well)లో పైన ఉన్న స్తంభాలను చూస్తే నాలుగు వైపులా కూడా తొమ్మిది స్తంభాలతో నిర్మించి ఉంటుంది. ఇలా ఈ బావిలో 42 స్తంభాలు ఉన్నాయని అక్కడున్న వారు చెబుతూ ఉంటారు. ఖిలా వరంగల్ రాజధాని మరియు ఇతర ఆలయాలు నిర్మాణం తరువాత మిగిలిన రాతితో ఈ బావిని నిర్మించినట్టుగా చెబుతుంటారు. అప్పట్లో ఏదైనా నిర్మాణం జరగాలంటే కొన్ని సంవత్సరాలు పట్టేది కానీ అంతస్తుల భావి కేవలం ఒక సంవత్సరం కాలంలోనే పూర్తి చేసినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తోంది.

రాణి రుద్రమదేవి (Rani Rudrama Devi) సొరంగ మార్గం ద్వారా ఈ బహుళ అంతస్తు బావికి వచ్చి స్నానమాచరించి మరో సొరంగ మార్గం ద్వారా వేయిస్తంభాల ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించేవారని చరిత్రకారులు చెబుతూ ఉంటారు.

పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దిన ప్రభుత్వం

అయితే ఈ బావి (Multi-storey well)లో ఈత కోసం వెళ్లి ఇద్దరు ముగ్గురు పిల్లలు చనిపోవడంతో ఈ బావిని కొద్దిరోజులు మూసేశారు ఆ తరువాత ప్రభుత్వం దీనిపై చొరవ తీసుకుని దీన్ని కూడా ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకుంది దాంతో ఈ బావి చుట్టూ గోడ నిర్మించి లోపలికి వెళ్లేందుకు గేట్లు అమర్చారు. అంతేకాకుండా ఈ బావి చుట్టూ చక్కనైన పూల చెట్లను బావిపైన, చుట్టూరా తిరిగేందుకు చక్కని మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీంతో వరంగల్లో మరొక పర్యాటక ప్రదేశం తెలుగు చూసింది అని చెప్పుకోవచ్చు...

రాణి రుద్రమ దేవి (Rani Rudrama Devi) సినిమా చూసిన వాళ్లందరికీ ఇక్కడికి వస్తే ఒక క్లారిటీ వస్తుంది సినిమాలో చూపించిన విధంగానే ఒక స్వరంగ మార్గం నుండి ఈ బావి వద్దకు చేరుకునే మార్గం వచ్చే పర్యాటకులనుకనువిందు చేస్తుంది.

ఎలా వెళ్లాలి?

మీరు కూడా ఈ ప్రదేశాన్ని చూడాలి అనుకుంటే నేరుగా వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి మెట్ల బావికి డైరక్ట్‌గా ఆటోలు ఉంటాయి. సొంత వాహనాల్లో వెళ్లేవాళ్లు వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుండి శివ నగర్ వెళ్లే మార్గానికి నేరుగా వెళ్తే.. మీకు ఈ బహుళ అంతస్తు బావి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా కూడా ఈ ప్రదేశాన్ని దారి చెప్తారు.

First published:

Tags: Telangana tourism, Warangal

ఉత్తమ కథలు