హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal BJP Meeting: బీజేపీకి మరో షాక్​.. వరంగల్​ సభకు అనుమతికి నిరాకరణ.. పూర్తి వివరాలివే

Warangal BJP Meeting: బీజేపీకి మరో షాక్​.. వరంగల్​ సభకు అనుమతికి నిరాకరణ.. పూర్తి వివరాలివే

బండి సంజయ్​ (ఫైల్​)

బండి సంజయ్​ (ఫైల్​)

ఇప్పటికే బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్రకు పోలీస్​ డిపార్ట్​మెంట్​ అనుమతి ఇవ్వలేదు. దీంతో కోర్టుకు వెళ్లి మరీ అనుమతి తెచ్చుకున్నారు బండి. తాజాగా వరంగల్​ పోలీసులు బండికి జలక్​ ఇచ్చారు

 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  బీజేపీ (BJP)కి తెలంగాణ (Telangana) ప్రభుత్వం షాక్​ల మీద షాక్​లు ఇస్తోంది. ఇప్పటికే బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్రకు పోలీస్​ డిపార్ట్​మెంట్​ అనుమతి ఇవ్వలేదు. దీంతో కోర్టుకు వెళ్లి మరీ అనుమతి తెచ్చుకున్నారు బండి. తాజాగా వరంగల్​ పోలీసులు బండికి జలక్​ ఇచ్చారు. దీంతో రెండు రోజుల్లో అక్కడ జరగాల్సిన బీజేపీ సభ రద్దయ్యే విధంగా ఉంది. వరంగల్‌లో(Warangal) బీజేపీ నిర్వహించాలనుకున్న సభకు (Meeting) అనుమతి ఇంకా ఇవ్వలేదు. ఈ నెల 27న వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో బీజేపీ సభ నిర్వహించాలనుకుంది.. అయితే ఈ కార్యక్రమానికి అనుమతిని (Permission) రద్దు చేసింది ఆ కళాశాల యాజమాన్యం. ఈ సభకు పోలీసుల పర్మిషన్​ లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కళాశాల యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో బీజేపీకి షాక్​ తగిలినట్లైంది.


  అయితే.. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత ముగింపును పురస్కరించుకొని ఈ నెల 27వ తేదీన వరంగల్ లో సభను నిర్వహించి తీరుతామని బీజేపీ నేతలు తేల్చి చెబుతున్నారు. ఈ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. దీంతో సభను ఎట్టి పరిస్థితుల్లోనైనా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో వరంగల్ ఆర్ట్స్ కాలేజీ యాజమాన్యం నిర్ణయంతో కాషాయ నేతలకు షాక్ తగిలినట్లయ్యింది.


  Munugodu: ప్రియాంక గాంధీతో భేటీ అనంతరం కోమటిరెడ్డి సంచలన నిర్ణయం.. వివరాలివే


  మరోవైపు బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పాదయాత్ర ఆపాలన్న పోలీసుల నోటీసులను హైకోర్టు రద్దు చేసింది. ఆపిన చోటే నుంచే యాత్రను బండి సంజయ్‌ ప్రారంభించనున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు అడుగడుగున అడ్డంకులు ఎదురైన సంగతి తెలిసిందే.. నిరసనలు ఆందోళనలు సవాళ్లు ప్రతిసవాళ్లు దాడులు ప్రతి దాడులతో సాగుతున్న పాదయాత్రకు జనగామ జిల్లాలో బ్రేక్ పడింది.‌


  మూడు రోజులపాటు ఉత్కంఠకు గురిచేసిన బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి లభించింది.‌ ఎట్టకేలకు హైకోర్టు నుంచి పాదయాత్రకు అనుమతి లభించడంతో కమలనాథుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఎక్కడైతే పాదయాత్ర ఆగిపోయిందో జనగామ జిల్లా పాంనూరు నుంచి చేపట్టేందుకు సిద్ధమయ్యారు. రూట్ మ్యాప్‌లో మార్పులు చేసి 27న భద్రకాళి అమ్మవారి పాదాల చెంతన పాదయాత్ర ముగించేలా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. ముగింపు సభను హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Kakatiya university, Telangana bjp, Warangal

  ఉత్తమ కథలు