Maripeda SI suspended: మహిళా ట్రైనీ ఎస్సై ఫిర్యాదు.. మరిపెడ ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు.. అసలు ఆ రాత్రి ఏం జరిగింది..

ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి

శిక్షణలో భాగంగా మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఒకరు 15 రోజుల క్రితం మరిపెడ స్టేషన్‌కు వచ్చారు. వచ్చిన నాటి నుంచి ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి ఆమెను లైంగికంగా వేధించసాగాడు.

  • Share this:
    ఓ మహిళా ట్రైనీ ఎస్‌ఐ‌పై.. ఆ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ లైంగిక వేధింపులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఆమె స్టేషన్‌కు వచ్చిన నాటి నుంచే వేధించడం ఎస్‌ఐ ప్రారంభించాడు. ఈ ఘటన తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లాలో చేసింది. చివరకు ఆ ట్రైనీ ఎస్‌ఐ.. వరంగల్ సీపీని కలిసి ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ప్రాథమిక విచారణ జరిపిన అధికారులు.. సదురు ఎస్‌ఐపై సస్పెషన్‌ వేటు వేశారు. శాఖపరమైన విచారణకు ఆదేశించారు. వివరాలు.. శిక్షణలో భాగంగా మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఒకరు 15 రోజుల క్రితం మరిపెడ స్టేషన్‌కు వచ్చారు. వచ్చిన నాటి నుంచి ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి ఆమెను లైంగికంగా వేధించసాగాడు.

    శిక్షణలో భాగంగా మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఒకరు 15 రోజుల క్రితం మరిపెడ స్టేషన్‌కు వచ్చారు. వచ్చిన నాటి నుంచి ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి ఆమెను లైంగికంగా వేధించసాగాడు. సోమవారం అర్ధరాత్రి పెద్దమొత్తంలో నల్లబెల్లం ఉన్నట్లు సమాచారం వచ్చిందని శ్రీనివాస్‌రెడ్డి సదరు ట్రైనీ ఎస్‌ఐని వెంటబెట్టుకుని వెళ్లాడని ట్రైనీ ఎస్‌ఐ తెలిపారు. అటవీప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడని ఆరోపించారు. పక్కా పథకం ప్రకారమే డ్రైవర్ లేకుండా ట్రైనీ ఎస్‌ఐని శ్రీనివాస్‌రెడ్డి వెంటపెట్టుకుని వెళ్లాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    ఈ ఘటనపై ట్రైనీ ఎస్‌ఐ.. మహబూబాబాద్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. అయితే వారి నుంచి స్పందన లేకపోవడంతో.. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. మంగళవారం వరంగల్‌ సీపీ తరుణ్‌ జోషిని ఇందుకు సంబంధించి ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తూ నార్త్‌జోన్‌ ఐజీ, వరంగల్‌ ఇన్‌చార్జ్‌ డీఐజీ నాగిరెడ్డి మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంఘటనపై శాఖాపరమైన విచారణ చేస్తున్నామని సీపీ జోషి పేర్కొన్నారు. శ్రీనివాస్‌రెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రుజువైతే అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. ఇక, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి 2014 బ్యాచ్‌కు చెందిన అధికారి.
    Published by:Sumanth Kanukula
    First published: