హోమ్ /వార్తలు /తెలంగాణ /

పేరుకే పెద్ద కాలేజీ..! సమస్యలు కూడా పెద్దవే..!

పేరుకే పెద్ద కాలేజీ..! సమస్యలు కూడా పెద్దవే..!

X
వరంగల్

వరంగల్ ఐటీఐలో సమస్యల తిష్ట

వరంగల్ (Warangal) ఐటిఐ కాలేజీలో సమస్యలతో సతమతమవుతున్నారు విద్యార్థులు. ఉద్యోగం, ఉపాధి కోసం బాట వేయాల్సిన శిక్షణ కేంద్రంలో సమస్యలు తీష్ట వేశాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Telangana

Santosh, News18, Warangal

వరంగల్ (Warangal) ఐటిఐ కాలేజీలో సమస్యలతో సతమతమవుతున్నారు విద్యార్థులు. ఉద్యోగం, ఉపాధి కోసం బాట వేయాల్సిన శిక్షణ కేంద్రంలో సమస్యలు తీష్ట వేశాయి. తాగుదామంటే నీళ్లు లేవు.. బాత్రూం ఫెసిలిటీ లేదు. చిన్నపాటి చినుకులు పడినా ఐటిఐ క్యాంపస్ చిత్తడి అవుతుందని వాపోతున్నారు ఇక్కడ విద్యార్థులు. 1959లో నిర్మించిన ఈ ఐటిఐ బిల్డింగ్ ఎప్పుడు కూలిపోతుందని టెన్షన్ టెన్షన్తో ఉంటున్నారు ఇక్కడి విద్యార్థులు, సిబ్బంది. ఆదిలాబాద్ (Adilabad), కరీంనగర్ (Karimnagar), ఖమ్మం (Khammam), వరంగల్ జిల్లా (Warangal District) లను కలిపి రీజియన్ గా ఈ కాలేజీ ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఐటిఐ కాలేజీలను పర్యవేక్షించడం కోసం డిప్యూటీ డైరెక్టర్ పోస్టులు కూడా మంజూరు చేసింది ప్రభుత్వం.

వరంగల్ కేంద్రంలోని ములుగు రోడ్ లో ఉన్నటువంటి ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కాలేజీలో కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. పాత భవనాలు కావడంతో ఎప్పుడు కూలిపోతాయోనని భయాందోళనకు గురవుతున్నారు విద్యార్థులు. పగుళ్ల గోడలు, పైకప్పుల పగుళ్ళతో అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని చదువుకుంటున్నారు విద్యార్థులు. సమస్యలు పరిష్కరించాలని అధికారులను కలిసినా ప్రయోజనం లేదంటున్నారు కాలేజీ ప్రిన్సిపాల్.

ఇది చదవండి: ఫ్రెండ్ షిప్ అంటే ఇదే.. వాట్సాప్ స్టేటస్ తో ఫ్రెండ్ కుటుంబానికి సాయం..!

ఐటిఐ కాలేజీలో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, తాగడానికి మంచినీటి సౌకర్యం, బాత్రూం సౌకర్యం లేక మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారని.. గత ఐదు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేయడం లేదని చెప్పారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ఐటిఐ కాలేజీలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించాలని అంటున్నారు ఐటిఐ కాలేజ్ ప్రిన్సిపాల్ జూమ్లా నాయక్.

మరోవైపు ప్రాక్టికల్స్ నిర్వహణ, యంత్రాల మరమత్తులు కోసం నిధులు కేటాయించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తుంది అంటున్నారు ప్రిన్సిపాల్. హనుమకొండ, కాజీపేట, భూపాల్ పల్లి, ఏటూర్ నాగారంలోని ఐటిఐ కాలేజీలో ఇప్పటికీ ఇన్చార్జి పాలన కొనసాగుతుందని కూడా చెప్పారు. వరంగల్ లోని ఐటిఐ కాలేజీలో ఉన్న 11 కోర్సుల్లో అవసరానికి తగ్గ స్టాఫ్ కూడా లేకపోవడంతో స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు