మిర్చీ మరోసారి మంట పెడుతోంది. కొనకుండానే.. ఘాటెక్కిస్తోంది. మిర్చీ ధర... వరంగల్ మార్కెట్లో రికార్డు స్థాయిలో పెరిగింది. వరంగల్‌లోని ఎనుమాములలోని ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌లో మిర్చీ ధర క్వింటాల్‌కు రూ.81,000గా ఉంది. అయితే గతేడాది. అయితే గతేడాది క్వింటాల్‌కు రూ.90 వేలతో పోల్చితే తక్కువ.తేజ రకం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.36,000 ధర పలికింది. దేశీ ఎర్ర మిర్చి మార్కెట్‌కు వచ్చిన అన్ని రకాల రకాలతో కలిపి మొత్తం 6,192 క్వింటాళ్ల వరకు ఉంది.
గతేడాది భారత్‌లో క్వింటాల్ దేశీ మిర్చి రూ.90,000కు విక్రయించబడింది. జనగాం జిల్లాలోని పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో మిర్చి ఎక్కువగా పండుతుంది. చరిత్రలోనే కాదు రికార్డు ధరతో, అమ్మకాలతో దేశీయంగా రికార్డు నెలకొల్పిందని వ్యాపారులు చెబుతున్నారు. ఏటా మిర్చి పంటకు తెగులు సోకడం, లేదా అకాల వర్షాలతో పంట పాడవ్వడం.. ఫలితంగా దిగుబడి తగ్గిపోవడంతో.. డిమాండ్ కు తగ్గ దిగుబడి లేకపోయేది. దాంతో ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో మిర్చికి గిరాకీ ఏర్పడింది. అందుకే మిర్చి ధరలు రికార్డు సృష్టించాయని ఎనుమాముల మార్కెట్ అధికారులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mirchi market, Warangal