పాఠాలు చెప్పాల్సిన పంతుళ్లు పవిత్రమైన పాఠశాలలోనే పాడు పనులు చేశారు. విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు వచ్చే బాలికల పట్ల వక్రబుద్ధి ప్రదర్శించి వికృత చేష్టలకు పాల్పడ్డారు. మహబూబాబాద్Mahbubabad జిల్లా మరిపెడ(Maripeda) మండల కేంద్రంలోని సెయింట్ అగస్ట్రా ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్(St. Augusta Private English Medium School)లో ఒకరు ఇద్దరు కాదు నలుగురు ఉపాధ్యాయులు బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి పరువు పోగొట్టుకున్నారు. పంతుళ్లమనే పొగరుతో లైంగిక వేధింపుల(Sexually assaulted)కు గురి చేయడంతో భరించలేకపోయిన ఆడపిల్లలను విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో అందరూ వచ్చి స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. నలుగురు ఉపాధ్యాయులతో పాటు వాచ్‌మెన్‌కి దేహశుద్ధి చేశారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.
ఆడపిల్లల పట్ల అసభ్యప్రవర్తన..
విద్యార్ధులకు పాఠాలు చెప్పే గురువులు మూడో దైవంగా కొలుస్తారు. అందుకే ఆచార్య దేవోభవ మాటను పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పుతారు. మరి అలాంటి పవిత్రమైన వృత్తిలో గౌరవప్రదమైన బాధ్యతలు నిర్వహించాల్సిన పంతుళ్లు విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఈసంఘటన చోటుచేసుకుంది. సెయింట్ అగస్ట్రా ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో పీఈటీ రాంబాబుతో పాటు లెక్కల టీచర్ రవి, హిందీ పాఠాలు బోధించే ఖదీర్, వాచ్‌మెన్ శ్రీను, డ్రైవర్ బిచ్చ స్కూల్‌లో ఆరవ తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుకునే బాలికల పాలిట కామాంధుల్లా తయారయ్యారు.క్లాసు రూముల్లోనే ఆడపిల్లల షర్ట్ జేబుల్లో చేతులు పెట్టి తడమటం, ముట్టుకోకూడని ప్రదేశాల్లో టచ్ చేస్తూ వారికి ఇబ్బంది కలిగిస్తూ శునకానందాన్ని పొందారు. అంతే కాదు వాష్ రూమ్‌కి వెళ్లాలని పర్మిషన్ అడిగితే వస్తుందా లేక అబద్దం ఆడుతున్నావా అంటూ గేలి చేయడం, అమ్మాయిలకు అభ్యంతకరమైన పనులు చేయడంతో విసిగిపోయారు.
టీచర్‌లు కాదు కీచకులు..
అప్పటి వరకు భరిస్తూ వచ్చిన ఆడపిల్లలు టీచర్‌ల రూపంలో ఉన్న కీచకుల లైంగిక వేధింపులు భరించలేకపోయారు. బాధిత బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్కూల్ దగ్గరకు చేరుకొని ఆందోళన చేపట్టారు. అటుపై ఉపాధ్యాయుల్ని తరగతి గదుల్లోంచి బయటకు ఈడ్చుకొచ్చి చితకబాదారు. పోలీసులకు సమాచారం ఇచ్చి వాళ్లకు అప్పగించారు.
కఠినంగా శిక్షించాలి..
తల్లిదండ్రుల కంటే ఎక్కవ సమయం ఉపాధ్యాయులు, తోటి విద్యార్ధుల మధ్య ఉండే ఆడపిల్లల పట్ల ఈవిధంగా ప్రవర్తించడం, నోటితో చెప్పలేని విధంగా వారి మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడటంతో బాలికల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కామాంధుల్ని స్కూల్‌లో ఉంచకుండా జైలుకు పంపాలని ..కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతుంటే స్కూల్ యాజమాన్యం ఏం చేస్తుందంటూ ప్రశ్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahabubabad, Telangana News