నట శేఖరుడు, తెలుగు ఇండస్ట్రీ సూపర్ స్టార్ కృష్ణ చనిపోయిన విషయం తెలిసిందే. ఇవాళ (నవంబర్ 15) తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కృష్ణ మరణం పట్ల ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. గుండెపోటు కారణంగా హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు కృష్ణ మరణించారు.
కృష్ణ పార్దీవ దేహాన్ని ఆసుపత్రి నుంచి నానక్ రామ్ గూడ లోని ఆయన నివాసానికి తీసుకెళ్లారు. దీంతో కృష్ణ ఇంటి పరిసర ప్రాంతాలన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని నలుమూలల నుంచి ఆయన్ను కడసారి చూసేందుకు కృష్ణ అభిమానులు తరలివచ్చారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా కృష్ణ ఫాన్స్ అసోసియేషన్ తరఫున భద్రకాళి దేవస్థానం మాజీ ధర్మకర్త తొనుపునూరి వీరన్న, రామప్ప దేవాలయ డైరెక్టర్ ఎలగందుల శ్రీధర్, వాసవి క్లబ్ వరంగల్ జిల్లా గవర్నర్ దాచపల్లి సీతారాం, వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ జర్నలిస్టులు అనుముల రాజబాబు, సునీల్ బొద్దుల.. కృష్ణ ఇంటికి చేరుకుని ఆయన పార్ధీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహేష్ బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరని తెలియగానే పలువురు సినీ నటులు, రాజకీయ పెద్దలు కృష్ణ మృతి పట్ల ఆవేదన చెందారు. కృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ జేశారు. అలాగే కృష్ణ ఇంటికి వెళ్లి దిగ్గజానికి నివాళులర్పించారు. పలువురు ప్రముఖులు సూపర్ స్టార్ మహేష్‌ను కలుసుకుని వ్యక్తిగతంగా ఓదార్చారు
అనారోగ్య సమస్యలతో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు కృష్ణ. నిన్న (సోమవారం) గుండెపోటు, శ్వాస ఇబ్బందులతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. శరీరంలోని ప్రధానమైన అవయవాలేవీ పనిచేయలేదు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. వైద్యానికి శరీరం సరిగా స్పందించక పోవడంతో ఆయన కన్నుమూశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Krishna, Local News, Tollywood, Warangal