హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : వరంగల్ జిల్లాలో ఫుడ్ పాయిజన్‌ వల్ల 30మంది స్టూడెంట్స్‌కి అస్వస్థత .. కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

Telangana : వరంగల్ జిల్లాలో ఫుడ్ పాయిజన్‌ వల్ల 30మంది స్టూడెంట్స్‌కి అస్వస్థత .. కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

బండి సంజయ్, కేసీఆర్(ఫైల్ ఫోటో)

బండి సంజయ్, కేసీఆర్(ఫైల్ ఫోటో)

Food poisoning: తెలంగాణలో సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, మైనార్టీ హాస్టళ్లలో విద్యార్దులు నాసీరకం భోజనం కారణంగా ఆసుపత్రి పాలవుతున్న ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపిస్తోంది.తాజాగా వరంగల్ జిల్లాలోని బల్లిపడిన భోజనం తిని 50మంది అస్వస్థకు గురవడం మరోసారి కలకలం రేపుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India

తెలంగాణలో సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, మైనార్టీ హాస్టళ్లలో విద్యార్దులు నాసీరకం భోజనం కారణంగా ఆసుపత్రి పాలవుతున్న ఘటనలు గత రెండు నెలలుగా వరుసుగా వెలుగులోకి వస్తున్నప్పటికి ప్రభుత్వం వాటిని అరికట్టడం లేదని బీజేపీ (BJP) ఆరోపిస్తోంది. వరంగల్(Warangal)జిల్లా వర్ధన్నపేట(Vardhannapet)ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్‌(Hostel)లో బల్లి పడిన ఆహారం తిని(Food poisoning) 50మందికిపైగా విద్యార్ధినులు ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో పది మంది పరిస్థితి సీరియస్‌గా ఉంది. పిల్లల ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ (BandiSanjay)  ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశ రాజకీయాలు పక్కనపెట్టి అనారోగ్యానికి గురైన విద్యార్ధినులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం కేసీఆర్‌(KCR)కి ప్రకటన ద్వారా సూచించారు. అవసరమైతే స్టూడెంట్స్‌ని హైదరాబాద్‌(Hyderabad)కు తరలించి ట్రీట్‌మెంట్ అందించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

TRS POLITICS : మంత్రి తలసాని స్టేషన్‌ఘనపూర్‌ పర్యటనకు కడియం శ్రీహరి డుమ్మా కొట్టడానికి కారణమా అదేనా ..?మరో 50మంది స్టూడెంట్స్‌కి అస్వస్థత..

తెలంగాణ సంక్షేమ ప్రభుత్వ హాస్టళ్లు,గురుకులాల్లో విద్యార్ధులు అస్వస్థతకు గురి కావడం పరిపాటిగా మారింది. గడిచిన మూడు నెలల్లో ఈసంఘటనలు పదుల సంఖ్యలో బయటపడటంతో ప్రభుత్వం ఏం చేస్తోందనే విమర్శలు అన్నీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. తాజాగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సోమవారం సాయంత్రం విషతుల్యమైన భోజనం తినడం వల్ల 50మందికిపైగా విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారు. స్టూడెంట్స్‌కి వడ్డించిన ఆహారంలో బల్లి పడిందని చనిపోయిన బల్లిని తీసి వడ్డించడం వల్లే సుమారు 60మంది విద్యార్ధినులు వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు. సోమవారం రాత్రి విద్యార్దినులు హాస్టల్‌ స్టూడెంట్స్ పరిస్థితి విషమంగా మారడంతో సిబ్బంది వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ 55మందిలో కొందరికి ప్రాథమిక చికిత్స అందించి హాస్టల్‌కు పంపారు. మిగిలిన 30మందికి సీరియస్‌గా ఉండటంతో వరంగల్ ఎంజీఎంలో కొందరిని వర్ధన్నపేట ఆసుపత్రిలో మరికొందరికి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.

బల్లిపడిన భోజనమే పెట్టారా..?

బల్లి పడిన భోజనం తిని పిల్లలు ఆసుపత్రి పాలయ్యారనే విషయం తెలుసుకున్న స్టూడెంట్స్ పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. హాస్టల్ సిబ్బంది, కుక్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్‌ జరిగిందన్న వార్త తెలియడంతో రాజకీయ పార్టీలు, విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని..సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలను పక్కనపెట్టి గురుకుల పాఠశాలల్లో విద్యార్ధులు పడుతున్న అవస్థలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు బీజీపీ చీఫ్.

ఆందోళనలు ఉధృతం..

ప్రభుత్వ హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందిచడంలో సర్కారు విఫలమైందని బీజేపీ నేతలతో పాటు విద్యార్ధి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న విద్యార్ధినులను వెంటనే హైదరాబాద్‌కు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు. స్టూడెంట్స్‌కి ఏదైనా జరిగితే ప్రభుత్వమే దానికి నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Bandi sanjay, CM KCR, Telangana News, Warangal

ఉత్తమ కథలు