హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: ఆ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నవారందరికీ గుడ్ న్యూస్.. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి.. పరీక్షలు ఎప్పటి వరకు అంటే?.?

Warangal: ఆ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నవారందరికీ గుడ్ న్యూస్.. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి.. పరీక్షలు ఎప్పటి వరకు అంటే?.?

పోలీసు పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి గుడ్ న్యూస్

పోలీసు పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి గుడ్ న్యూస్

Warangal: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. ముఖ్యంగా పోలీస్ జాబ్ ల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నవారికి అలర్ట్.. ఫిట్ నెస్ పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు.. పరీక్ష తేదీ ఎప్పుడంటే..?

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India

(Santhosh, News 18, Warangal)

పోలీస్ కానిస్టేబుల్, సబ్-ఇన్స్సెక్టర్ల నియామాకాల్లో భాగంగా నిర్వహింబడే దేహదారుఢ్య పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించే కేయూ మైదానంలో పరీక్షల ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ ఏవి ఆనంద్, అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. జనవరి 3 తారీకు వరకు దేహదారుఢ్య పరీక్షలు జరగనున్నాయి హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలంలోని మైదానంలో నిర్వహించే ఈ పరీక్షలకు ఉభయ వరంగల్ జిల్లా నుండి 24,612 మంది అభ్యర్థులు హజరవుతున్నారు. వీరిలో పురుషులు 19,651 మంది, మహిళలు 4961 మంది ఉన్నారు.

ఉదయం 5 గంటల నుంచి ఈ పరీక్షలు జరుగుతూ ఉంటాయి. వేర్వేరు తేదీల్లో 1,250 మంది చొప్పున పురుషులు, మహిళలకు ఈ పరీక్షలు  నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు వచ్చే అభ్యర్థులు అడ్మిట్ కార్డు, ఇంటిమేషన్ లెటర్, అభ్యర్థి స్వీయ సంతకంతో కూడిన పార్ట్-2 దరఖాస్తు ప్రింట్, కమ్యూనిటీ, ఎక్స్ సర్వీస్, ఎన్.ఓ.సి మరియు 24/1/2018 ప్రకారం ఏజేన్సీ సర్టిఫికేట్ల తీసుకురావల్సి వుంటుంది.

ఇదీ చదవండి : మొన్నటి వరకు ఇంజనీర్.. ఇప్పుడు రైతు.. ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?

పోలీస్ కమిషనర్ ఈ పరీక్షలకు హజరయ్యే అభ్యర్థులకు పలు సూచనలు చేస్తున్నారు. మైదానానికి చేరుకున్న అభ్యర్థులకు పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం జరుగుతోంది. ఇందుకోసం పరీక్షలు జరిగే మైదానంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అభ్యర్థులందరు నిఘా నీడలో వుంటారని, మొదటగా అభ్యర్థులు ధ్రువ పత్రాల పరిశీలన అనంతరం బయోమెట్రిక్ వెరిఫికేషన్ వుంటుంది. కావున అభ్యర్థులు చేతి వేళ్లపై మెహందీ, పచ్చబోట్లు లేకుండా జాగ్రత్త పడాలి.

ఇదీ చదవండి : అందరి చూపు ఎమ్ మంగీలాల్ వైపే.. ఏంటి అంత ప్రత్యేకత అనుకుంటున్నారా..?

బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తయిన తరువాత ప్రతి అభ్యర్థికి డిజిటల్ ఆర్ఎఫ్ఐడీ రిస్ట్బ్యండ్ వేస్తాం. అభ్యర్థి మైదానం వీడే వరకు అది అతని శరీరంపైనే వుంటుంది. పరీక్షలు ముగిసిన అనంతరం అధికారి పర్యవేక్షణలోనే రిస్ట్బ్యండ్ తొలగిస్తారు. పరీక్షలు జరిగే సమయంలో అభ్యర్థులు రిస్ట్ బ్యాండు తోలగించడంగాని, డ్యామేజ్ చేయడం చేస్తే వారిని అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది.

ఇదీ చదవండి : ఇంద్రకీలాద్రీ పై కృత్తికా దీప మహోత్సవం.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

తరువాత పురుష అభ్యర్థులకు 1600 మీటర్ల పరుగు, మహిళలు 800 మీటర్ల పరుగు పందెం నిర్వహింబడుతుంది. ఈ పరుగులో అర్హత సాధిస్తేనే ఎత్తు కొలతలు, లాంగ్ జంప్ షార్ట్పుట్ పరీక్షలకు అభ్యర్థులు అర్హత సాధిస్తారు. ఈ పరీక్షలు మహిళ అభ్యర్థులకు ఈ నెల 10వ తేది నుండి 14వరకు నిర్వహించబడుతాయి. ఈ పరీక్షలు హజరయ్యే అభ్యర్థులు తన వెంట తీసుకువచ్చే విలువైన వస్తువులతో పాటు సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగులు పరీక్ష కేంద్రంలోని అనుమతించబడవని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.

First published:

Tags: Jobs in telangana, Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు