హోమ్ /వార్తలు /తెలంగాణ /

సామాన్యుడి కడుపు నింపుతున్న స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్!

సామాన్యుడి కడుపు నింపుతున్న స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్!

X
రుచికరమైన

రుచికరమైన ఫుడ్

Telangana: వరంగల్, హనుమకొండ నగరాలలో రకరకాల హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్నా ఈ మధ్యకాలంలో స్ట్రీట్ ఫుడ్స్ కు యమ డిమాండ్ పెరిగిపోయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

వరంగల్, హనుమకొండ నగరాలలో రకరకాల హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్నా ఈ మధ్యకాలంలో స్ట్రీట్ ఫుడ్స్ కు యమ డిమాండ్ పెరిగిపోయింది. మిర్చి బజ్జి నుంచి ఫారెన్ ఫుడ్ ఐటమ్ దాకా అన్ని రోడ్లపై దొరుకుతున్నాయి. కోవిడ్ దెబ్బకి అతలాకుతలమైన జనజీవనం ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ కల్చర్ కి వచ్చేసింది. దీంతో నోరూరించే వెరైటీ ఫుడ్ ని లాగించేస్తున్నారు ఆహార ప్రియులు.

కోవిడ్ సమయంలో బయట ఎక్కడ ఆహారం తినాలన్నా చాలావరకు భయపడే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం ఎలాంటి భయం లేకుండా రోడ్ సైడ్ ఫుడ్ లాగించేస్తున్నారు భోజన ప్రియులు. అన్నం, కూర, పెరుగు, పప్పు, చారు, పాపడం, కాస్తంత పచ్చడ అంతే ఇంకేం కావాలి ఆకలితో ఉన్న కడుపుకి. ఆహా ఏమి భాగ్యం అంటూ తినేస్తూ రోడ్ సైడ్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ అంటున్నారు ఫుడ్ లవర్స్.

వరంగల్ మహానగరంలో సామాన్యుడు కడుపు నింపుతున్న ఈ రోడ్ సైడ్ ఫుడ్ పై న్యూ 18 ప్రత్యేక కథనం..

నగరంలో ఒకప్పుడు ఏది తినాలన్నా హోటళ్లకు వెళ్లాల్సిందే. కానీ ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది. ఎక్కడబడితే అక్కడ ఫుడ్ దొరుకుతుంది. అక్కడా ఇక్కడా అని లేదు.. అన్ని చోట్ల గల్లీకొక లంచ్ స్టాల్స్ పుట్టుకొచ్చాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు తీసుకొచ్చిన ఫుడ్ ను అమ్ముకొని వెళ్ళిపోతారు ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్. మన ఇంటి వద్ద భోజనం ఎలా ఉంటుందో రోడ్ సైడ్ ఫుడ్ టేస్ట్ కూడా అలానే ఉంది అంటున్నారు స్ట్రీట్ ఫుడ్ కస్టమర్స్.

ఇంటి నుంచి బాక్స్ తెచ్చుకుంటే ఒకటి రెండు కూరలతో సరిపెట్టుకోవాలి.. కానీ రోడ్ సైడ్ ఫుడ్స్ దగ్గరైతే నాలుగు అయిదు కూరలతో లాగించొచ్చని చెబుతున్నారు. పెద్దపెద్ద హోటల్స్ కెళ్ళి జేబులు గుల్ల చేసుకోవడం కంటే ఇక్కడ తినడం బెటర్ అంటున్నారు కొందరు. పైగా టాక్స్ ల భారం పెరగడంతో ఇదే కంఫర్ట్ అని చెబుతున్నారు.

నాలుగైదు ఏళ్లుగా రోడ్ సైడ్ ఫుడ్ తింటున్న వాళ్ళు కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాలేదని.. ముఖ్యంగా ఏ రోజు ఫుడ్ ఆ రోజే వీళ్ళు తీసుకొస్తారని చెప్తున్నారు. క్యాబ్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, చిరు వ్యాపారులతో పాటు కొంతమంది బ్యాంకు ఉద్యోగులు కూడా ఇక్కడే తింటుంటారు.

రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్స్ మెనూలో నాన్ వెజ్ కూడా ఉంటుంది. కొంచెం అమౌంట్ ఎక్కువ ఇస్తే చాలు ప్లేట్లోకి చికెన్, మటన్, బోటీ, ఫిష్ లాంటి ఐటమ్స్ వచ్చి పడతాయి. పైగా వీళ్ళ దగ్గర నాన్ వెజ్ ఫ్రెష్ ఉంటుంది. రెస్టారెంట్ల మాదిరి ఐస్ లో ఉంచే మాంసం కన్నా వీళ్ళ దగ్గరే బెటర్ అంటున్నారు ఇక్కడ రెగ్యులర్ కస్టమర్లు. వీళ్ళలో కొందరు రోడ్ సైడ్ బల్ల వేసుకొని మీల్స్ అమ్ముతుంటే.. మరికొందరు చిన్న చిన్న వెహికిల్స్ లోనే అమ్మేలా ఏర్పాటు చేసుకున్నారు. ఏది ఏమైనా స్ట్రీట్ ఫుడ్ చీప్ అండ్ బెస్ట్ అనిపిస్తున్నారు.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు