రిపోర్టర్ : సంతోష్
లొకేషన్ : వరంగల్
ఓవైపు ఆధ్యాత్మికం.. మరోవైపు ఆహ్లాదం.. ఇంకోవైపు పర్యాటకం. పర్వతగిరి గ్రామం భక్తులను, ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది. వరంగల్ జిల్లా కేంద్రానికి40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వతగిరి ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. ఇక్కడి పెద్ద చెరువు రిజర్వాయర్ సుమారు 500 ఎకరాల విస్తీరానికి సాగుచేస్తుంది. రిజర్వాయర్ కు అనుకొని ఇరువైపులా పంచగుట్టలు ఉన్నాయి.
అందులో చెన్నకేశవ గుట్ట.. ఆ గుట్టపై కాకతీయులు నిర్మించినటువంటి వందల సంవత్సరాల క్రిందటి శివాలయం నెలకుంది. కాకతీయుల కాలం 11వ శతాబ్దం నాటి ఈ పురాతనమైన దేవాలయం.. కాకతీయుల రాజ్యానికి దక్షిణాన ఉండే సిద్ధ క్షేత్రంగా పిలవబడే ఈ దేవాలయానికి.. నాలుగు వైపులా కాలభైరవ, నాగభైరవ, చెన్నకేశవ, త్రికోట ఆలయాలు ఉంటాయి.
సుమారు 6 కోట్ల రూపాయల వ్యయంతో పురాతనమైన దేవాలయాన్ని పునర్నిర్మానాన్ని చేపట్టారు. కొండపై ఉన్న ఈ దేవాలయం చుట్టూ ఉన్న కొండల వైశాల్యం నాలుగు కిలోమీటర్లు, ఈ కొండ చుట్టూ భవిష్యత్తులో గిరి ప్రదక్షిణ చేసే అటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయట. అరుణాచల క్షేత్రంలో దేవాలయ శిఖరంపై అఖండ జ్యోతి ఎలా అయితే ఉంటుందో అలాగే ఈ దేవాలయంపై అఖండ జ్యోతిని ఏర్పాటు చేస్తారట.
పర్వతగిరి శివాలయ పునర్నిర్మాణ ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఇక్కడ రోజంతా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గాయనీ, గాయకులలతో కచేరి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, పిఠాధిపతి శివ స్వామి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. పర్వతాల శివాలయం పునర్ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పర్వతగిరి గ్రామం చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా పాల్గొని శివుడి ఆశీస్సులను పొందాలన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal