హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: అంబేద్కర్ జీవిత చరిత్రపై పాట.. రచయితతో ఫేస్ టూ ఫేస్!

Warangal: అంబేద్కర్ జీవిత చరిత్రపై పాట.. రచయితతో ఫేస్ టూ ఫేస్!

X
అంబేద్కర్

అంబేద్కర్ జీవిత చరిత్ర పై పుస్తకం

Warangal: కూర్చుంటే తప్పు, నిలుచుంటే తప్పు, గుడిలోకి వెళ్తే తప్పు, బడిలోకి వెళ్తే తప్పు, ముట్టుకున్నా తప్పే.. నీరు తాగినా తప్పే. ఒకానొక సమయంలో అంటరాని తనంతో అట్టడుగు ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉండేది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Santhosh, News 18, Warangal.

కూర్చుంటే తప్పు, నిలుచుంటే తప్పు, గుడిలోకి వెళ్తే తప్పు, బడిలోకి వెళ్తే తప్పు, ముట్టుకున్నా తప్పే.. నీరు తాగినా తప్పే. ఒకానొక సమయంలో అంటరాని తనంతో అట్టడుగు ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉండేది. అలాంటి సమయంలో అణగారిన ప్రజల కోసం ఓ విప్లవ వీరుడు పుట్టుకొచ్చాడు. అప్పటివరకు మూగబోయిన బలహీన ప్రజలకు గొంతుకయ్యాడు. అతనే డాక్టర్ బిఆర్ అంబెడ్కర్. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆర్థికనిపుణులు, మహా మేధావి అని ఎన్నో రకాల బిరుదులూ ఉన్న గొప్ప వ్యక్తి.

1891 సంవత్సరం ఏప్రిల్ 14 నాడు మధ్యప్రదేశ్ లో రాంజీ మలోజీ సాక్వాల్, భీమాబాయ్ దంపతుల 14వ చివరి సంతానంగా జన్మించాడు అంబేద్కర్. ఇతని అసలు పేరు భీమారావు రంజీ అంబావడేకర్. అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అంటవాడ గ్రామంలో ఉండేవారు. వీరి వంశీకులు మహార్ కులానికి చెందినవారు. అంబెడ్కర్ తండ్రి బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారుగా పనిచేసాడు.

డబ్బులు చెల్లించే స్థోమత వున్నా సేవలు అందిచేవాళ్ళు ముందుకు రాకపోవడంతో మంగలి, చాకలి వాళ్ళు వీరి బట్టలనూ ముట్టుకునేవారు కాదు. అతని సోదరులే ఇంట్లో బట్టలు ఉతకడం, జుట్టు కత్తిరించుకోవడం చేసుకునేవారు. అంబేడ్కర్ తొమ్మిది సంవత్సరాల వయసులో మసూర్ నుండి గోరేగావ్ కి ప్రయాణం చేయడానికి ఎడ్లబండి వాళ్ళు ఎవ్వరూ ముందుకురాకపోతే, మసూర్ స్టేషన్ మాస్టర్ సహాయంతో బండివాడికి రెండింతలు కిరాయి ఇచ్చి, బండివాడు వెనుక నడువగా అంబేడ్కర్ సోదరులే సొంతగా బండి నడుపుకుని వెళ్లారట. అలాంటి పరిస్థితులన్నీ గమనించి నిమ్నవర్గాలపై పోరాడి న్యాయం జరిగేలా చేశారు. ఇంతటి మహనీయుడు స్ఫూర్తితో తనపై అభిమానంతో బి ఆర్ అంబెడ్కర్ జీవిత చరిత్రపై పాట రాసిన వ్యక్తి హనుమకొండ జిల్లా పత్తిపాక గ్రామానికి చెందిన సుమన్ తో న్యూస్ 18 లోకల్ ఫేస్ టూ ఫేస్..

ఆయన మాటలలో...

సమాజంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని అన్నివిధాలా ముందుకు సాగుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం సోదరభావంతో ఉన్నారంటే దానికి కారణం అంబెడ్కర్. కాబట్టి అయన స్ఫూర్తితో తనపై ఉన్న అభిమానంతో ఒక పాటను రచించానని.. డిసెంబర్ 6న ఈ పాటను విడుదల చేస్తున్నానని తెలిపారు. ఇలాంటి మహనీయుడిపై పాటను రచించడం చాల ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు రచియిత సుమన్.

First published:

Tags: Ambedkar, Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు