WARANGAL SON COMMITS SUICIDE AFTER MOTHER DEATH IN WARANGAL VRY
Warangal : అమ్మ వెంటే తానంటూ... కొడుకు దారుణం..! ఆరు నెలలుగా నరకయాతన..!
Warangal : అమ్మ వెంటే తానంటూ... ఓ కొడుకు దారుణం..!
Warangal : కరోనాతో చనిపోయిన అమ్మను వీడలేని ఓ కొడుకు తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు.. అమ్మ చనిపోయి ఆరు నెలలు గడుస్తున్నా.. ఆమె జ్ఝాపకాల నుండి బయటపడలేక పోయాడు. ఇలా మానసిక వేదనతో అమ్మ దగ్గరికి వెళతానంటూ ఆత్మహత్య చేసుకున్నాడు.
కరోనా మహమ్మారి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రాణాలు తీస్తోంది.. కరోనాతో చనిపోయిన వ్యక్తుల కుటుంబాల్లో కొంతమంది అనాధాలుగా మిగులుతుంటే... చనిపోయిన వారినే తలచుకుని మరికొంతమంది బలవన్మారణాలకు పాల్పడుతున్నారు. ఇలా తాజాగా ఓ యువకుడి అమ్మ ఆరునెలల క్రితం తట్టుకోకపోవడంతో రాత్రిళ్లు కూడా నిద్రపట్టని పరిస్థితిలోకి జారి పోయాడు.. ఇలా ఆరునెలలుగా అమ్మమీద బెంగతో మానసిక సరిగా లేని స్థాయికి దిగజారిపోయాడు.. ఓవైపు తండ్రి మరోవైపు సోదరుడు ఉన్నా వీళ్లవరు ఆ యువకుడికి భరోసాను కల్పించలేకపోయారు.దీంతో మానసికంగా కృంగిపోయిన ఆ యువకుడు తాను కూడా అమ్మదగ్గరికే వెళ్తానంటూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హన్మకొండ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. హన్మకొండ జిల్లా ఖాజీపేట పట్టణానికి చెందిన మహ్మద్ గౌస్పాష తన తండ్రి, సోదరుడితో కలిసి రైల్వే క్వార్టర్లో నివాసం ఉంటున్నాడు. అయితే గౌస్పాష తల్లి గౌసియా గత ఆరునెలల క్రితం కరోనా సోకడంతో మృత్యువాత పడింది. అయితే అప్పటి నుండి గౌస్పాష తన తల్లి కోసం ఏడూస్తూనే ఉన్నాడు. తల్లి మరణాన్ని తట్టుకోలేని గౌస్పాష రాత్రిళ్లు కూడా నిద్రపోని స్థితికి చేరుకున్నాడు. తల్లికోసం తపన పడుతూ మానసికంగా కుంగిపోయాడు. ఇలాంటి పరిస్థితిలోనే తాను కూడా అమ్మదగ్గరికి వెళతనంటూ తన నివాసానికి సమీపంలోని అయోధ్యపురం రైల్వే గేటు వద్ద రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.