హోమ్ /వార్తలు /తెలంగాణ /

నత్తనడకన కాళోజీ కళాక్షేత్రం అభివృద్ధి పనులు..

నత్తనడకన కాళోజీ కళాక్షేత్రం అభివృద్ధి పనులు..

X
నత్తనడకన

నత్తనడకన కాలేజీ పనులు

Telangana: వరంగల్ మహా నగరంలో ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్మాణం పనులు ఆర్భాటాల వరకే పరిమితమైన పరిస్థితి నెలకొంది. 

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

(Santhosh, News 18, Warangal)

వరంగల్ మహా నగరంలో ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్మాణం పనులు ఆర్భాటాల వరకే పరిమితమైన పరిస్థితి నెలకొంది.  హైదరాబాదులోని రవీంద్ర భారతిని మించే విధంగా వరంగల్లోని కాళోజీ కళాక్షేత్రాన్ని 1500 మంది కూర్చునే విధంగా ఎయిర్ కండిషన్ తో కూడిన హల్ ను నిర్మిస్తామని వెంటనే 12 కోట్లు మంజూరు చేస్తాం 60 లక్షలతో పుస్తకాలు, ఫోటోలు పెట్టేందుకు అద్భుతమైన డిజైన్ చేస్తామని 2014వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన ప్రకటన..

2014 సెప్టెంబర్ 9 కాళోజి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కార్యక్రమానికి హాజరైనటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కాళోజీ పేరు పైన కాళోజి కళాక్షేత్రాన్ని రవీంద్ర భారతి తరహాలో వరంగల్ లో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఏడున్నర సంవత్సరాల గడుస్తున్న ఇప్పటివరకు కూడా కాళోజి కళాక్షేత్ర నిర్మాణం ఇప్పటివరకు కూడా పూర్తికాలేదు.

కాళోజీ కళాక్షేత్రానికి 15 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 35 కోట్ల రూపాయలు నిధులను విడుదల చేయకపోవడం వల్ల కాళోజీ కళాక్షేత్రం సకాలంలో పూర్తికాలేదు. కాళోజి కళాక్షేత్రానికి శంకుస్థాపన చేసి సమయంలో ఆరు నెలల వ్యవధిలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఏడున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు కళాక్షేత్రం పూర్తి కాలేదు.

అయితే కాలేజీ కళాక్షేత్రానికి 15 కోట్ల రూపాయలు మంజూరు చేతులు దులుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం మిగతా నిధులు విడుదల చేయకపోవడం వల్ల కాలోజీ కళాక్షేత్ర నిర్మాణం నత్తనడకన కొనసాగుతోంది, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కాలేజీ కళాక్షేత్ర నిర్మాణానికి పూర్తి చేయడం కోసం 40 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటన కూడా చేయడం జరిగింది

తర్వాత కూడా కాలేజీ కళాక్షేత్ర నిర్మాణం పనులు వేగవంతం కాలేదు ఇప్పటివరకు ఏడున్నర సంవత్సరాల లొ కళాక్షేత్ర నిర్మాణం 50 శాతం పూర్తయింది కానీ 7:30 సంవత్సరాలలో ముఖ్యమంత్రి కెసిఆర్ తన నివాస మైనటువంటి ప్రగతి భవన్ ను పూర్తి చేసుకోగలరు.

119 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు పూర్తి చేశారు, ప్రతి జిల్లాలలో టిఆర్ఎస్ పార్టీ భవనాలను కూడా పూర్తి చేయగలిగారు, కానీ 700 సంవత్సరాలు గడుస్తున్న కాళోజి కళాక్షేత్ర నిర్మాణం పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి . కాళోజీ కలక్షత్ర నిర్మాణం ఎందుకు పూర్తి కావడం లేదు నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని కళాక్షేత్రాన్ని పూర్తి చేయడంలో ప్రభుత్వం అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఇదేనా కాళోజీకి మనం ఇచ్చే విలువ అని అంటున్నారు సామాజిక కార్యకర్త తిరునాహరి శేషు.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు