హోమ్ /వార్తలు /తెలంగాణ /

Brother and sister Affair: అన్నా చెల్లెల్ల సహజీవనం.. అడ్డుగా ఆరేళ్ల కూతురు ఉందని ఏం చేశారంటే..?

Brother and sister Affair: అన్నా చెల్లెల్ల సహజీవనం.. అడ్డుగా ఆరేళ్ల కూతురు ఉందని ఏం చేశారంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తాత్కాలిక సంతోషం, సుఖం కోసం ఎంతో మంది వివాహేతర సంబంధాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధం అన్నది ఇద్దరు వ్యక్తులకు సంబంధించినదే అయినప్పటికీ దాని ఫలితాలు, పర్యవసానాలు ఎన్నో జీవితాలతో ముడిపడి ఉంటాయన్న విషయాన్ని ప్రజలు గుర్తించడం లేదు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Mahabubabad

మానవత్వం మంట కలిసిపోతుంది.. దాంపత్యాలు కూలుతున్నాయి. వివాహేతర సంబధాలతో హత్యలకు వెనకాడడం లేదు. ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య బంధాలు,అనుబంధాలు, రాగాలు, అనురాగాలు మంటగలసి పోతున్నాయి. ఈ జిల్లా ఆ జిల్లా అన్న తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు వేలం వెర్రిగా బయటపడుతున్నాయి. అన్నింట్లోనూ వివాహేతర సంబంధాలదే ప్రధాన భూమికగా మారింది. తాత్కాలిక సంతోషం, సుఖం కోసం ఎంతో మంది వివాహేతర సంబంధాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధం అన్నది ఇద్దరు వ్యక్తులకు సంబంధించినదే అయినప్పటికీ దాని ఫలితాలు, పర్యవసానాలు ఎన్నో జీవితాలతో ముడిపడి ఉంటాయన్న విషయాన్ని ప్రజలు గుర్తించడం లేదు. కొన్ని నిమిషాల ఆనందం కోసం జీవితాన్ని, కుటుంబాన్నే పనంగా పెడుతున్నారు. ఇటీవల కాలంలో ఒకటి.. రెండు కాదు.. వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో హత్యలు జరిగాయి. వీటివల్ల ఎన్నో కుటుంబాలు ఛిద్రమయ్యాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. అయితే ఇక్కడ అన్నా చెల్లెల్లే అక్రమ సంబంధం (illegal affair) పెట్టుకోవడం సంచలనం రేకెత్తించింది.

ఊరు నుంచి పారిపోయి..

మహబూబాబాద్‌ (Mahabubabad) జిల్లా కేసముద్రం మండలం ఉమ్మడి పెనుగొండ గ్రామ శివారు నర్సింహులగూడెంకు చెందిన పూనెం శిరీషకు.. ఏడేళ్ల క్రితం పెనుగొండ గ్రామ శివారు కట్టుగుడెంకు చెందిన అశోక్‌తో వివాహం జరిగింది. వీరికి కూతురు అనూశ్రీ (6) ఉంది. శిరీష తన సొంత అన్న పూనెం కుమారస్వామితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అన్నాచెల్లె కలిసి ఐదేళ్ల క్రితం అనూశ్రీని తీసుకుని భువనగిరిలోని మర్రిగుడెంకు వెళ్లారు. అక్కడే పౌల్ట్రీఫాంలో పనిచేస్తూ సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఇద్దరు కుమారులు జన్మించారు. అనూశ్రీ తరచూ అనారోగ్యంతో బాధపడుతుండేది. ఆస్పత్రులకు తీసుకెళ్లే స్థోమత లేకపోవడం, పెరిగి పెద్దదైతే ఖర్చులు భరించాల్సి వస్తుంది. పైగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని వారు భావించారు.

దీంతో పాపను చంపేయాలనుకున్నారు ఇద్దరు కషాయిలు. గత నెల 24న అనూశ్రీ చాతిపై తల్లి కూర్చోని గట్టిగా పట్టుకోగా కుమారస్వామి గొంతు నులిమి హత్య చేశాడు. మరుసటి రోజు మృతదేహన్ని స్వగ్రామమైన నర్సింహులగూడెం తీసుకెళ్లి కడుపునొప్పితో చనిపోయినట్లు నమ్మించి అంత్యక్రియలు చేసే ప్రయత్నం చేశారు ఇద్దరు. గ్రామస్తులకు అనుమానం రావడంతో డయల్‌ 100కు సమాచారం అందించారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. కాగా, పోస్టుమార్టంలో బాలిక గొంతు నులిమి హతమార్చినట్లు తేలింది. దీంతో పోలీసులు శిరీష, కుమారస్వామిని అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం ఒప్పుకున్నారు.

కాగా, గతంలోనూ ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువకుడు(24) తన సోదరి ద్వారా పరిచయం అయిన ఒకయువతి(21)తో ప్రేమలో పడ్డాడు. ఏడాది కాలంగా ఇద్దరూ ప్రేమలో మునిగి తేలారు. ఇక ప్రేమ వ్యవహారం చాలు, పెళ్లి చేసుకుందామని…10 రోజుల క్రితం హైదరాబాద్ శివారులో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఎవరి ఇంటికి వారు వెళ్లి జీవించసాగారు.

ఈ క్రమంలో వారి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవి చూసిన వారి బంధువులు వారిద్దరి మధ్య ఉన్న బంధుత్వాన్ని చెప్పారు. ఇద్దరూ అన్నా చెల్లెళ్ల వరస అవుతారని వారికి వివరించారు. దీంతో మనస్తాపానికి గురైన యువతి మంగళవారం పురుగుల మందు తాగి బలవన్మరణం చెందింది. విషయం తెలుసుకున్న యువకుడు కూడా పురుగుల మందుతాగి ఓ వ్యవసాయ బావిలో దూకాడు.

First published:

Tags: Brother and sister fall in love, Crime news, Illegal affair, Mahabubabad

ఉత్తమ కథలు