తప్పు చేయడం ఆ తప్పును తమ అర్ధబలం, అంగబలాన్ని అడ్డుపెట్టుకొని తుడిచేసుకొని చేతులు కడుక్కోవాలనుకోవడం కొందరికి పరిపాటిగా మారింది. వరంగల్ Warangalజిల్లా వర్ధన్నపేట Vardhannapeta మండలంలో కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ల్యాబర్తిLaborti గ్రామ సర్పంచ్ పస్తం రాజు, పత్తి నాగరాజు ఓ మైనర్((Minor) బాలికపై అత్యాచారం(Assault) చేయడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసి వ్యవహారాన్ని గుట్టుగా ఉంచడంతో మైనర్ బాలిక గర్భం (Pregnant) దాల్చింది. విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా అత్యాచారానికి గురైన మైనర్ బాలికను ఎవ్వరికి తెలియని రహస్య ప్రదేశంలో ఉంచారు కుటుంబ సభ్యులు. మరోవైపు న్యాయం చేయాలని కోరుతున్న బాధితురాలి తల్లిదండ్రులను ఊరి చివర్లో ఉన్న ఓ తోటలోకి తీసుకెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు గ్రామ పెద్దలు, మరికొందరు టీఆర్ఎస్ నాయకులు. ఈ పంచాయితీ ముగిసిన తర్వాతే బాలికను బయటకు తేవాలని బాధితురాలి బంధువులు తల్లిదండ్రులకు సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Warangal