(P.Srinivas,New18,Karimnagar)
గ్రామాన్ని పాలించాల్సిన మహిళ కూలీగా మారింది. ఇది వాస్తవం. బంగారు తెలంగాణలో భాగంగా తనను సర్పంచ్(Sarpanch)గా గెలిపించిన ఊరిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్దామని ప్రయత్నించింది. అందులో భాగంగానే గ్రామం అభివృద్ధి చెందింది కాని ఆమె బ్రతుకే తలకిందులైంది. మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా దంతాలపల్లి(Dantalapalli) గ్రామ సర్పంచ్‌గా గెలిచిన దర్శనాల సుష్మిత(Sushmita)ధీనగాధ ఇది. దళితురాలు గ్రామ సర్పంచ్‌గా గెలిచిన తర్వాత గ్రామంలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల కోసం అప్పుగా డబ్బులు తెచ్చి ఖర్చు చేసింది. అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం, ఖర్చు చేసిని డబ్బులకు బిల్లులు మంజూరు చేయకపోవడంతో సర్పంచ్ కాస్తా కూలీ(Laborer)గా మారింది.
కూలీగా మారిన సర్పంచ్ ..
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన దళిత మహిళా సర్పంచ్ దర్శనాల సుష్మిత పత్తి చేనులో దినసరి కూలి పని చేస్తోంది. గ్రామభివృద్ధి కై చేసినా అప్పులు తీర్చడానికి చివరకు రోజు వారి కూలీ పనులకు వెళ్లడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. గ్రామ అభివృద్ధి కోసం సుమారు 20లక్షల రూపాయలు అప్పు తెచ్చి ఊరి కోసం ఖర్చు చేసింది సర్పంచ్ సుష్మిత. బిల్లుల కోసం ఎదురు చూడటం తప్ప ఏమి ప్రయోజనం లేకపోవడంతో చేసిన అప్పులు తీర్చడానికి కూలీగా మారినట్లు సర్పంచ్ సుష్మిత తెలిపారు.
కేసీఆర్ పాలనలో అప్పులపాలై కూలీలుగా మారుతున్న సర్పంచులు. మహాత్మా గాంధీ కల, గ్రామ స్వరాజ్యం,అది రాజీవ్ గాంధీ గారు పంచాయితీ రాజ్ వ్యవస్థతో,దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలను బలోపేతం చేస్తే,నేడు ఈ ఫ్యాసిస్టు మోడీ కేసీఆర్‌లు,గ్రామ సర్పంచులను కూలీలుగా మార్చారు. ఇదేనా బంగారు తెలంగాణ? pic.twitter.com/Ar1GLF1YpA
— Telangana Congress (@INCTelangana) November 10, 2022
గ్రామాభివృద్ధి కోసం పాటుపడ్డందుకే..
ప్రభుత్వం గ్రామాభివృద్ధి కోసం నిధులను విడుదల చేయకుండా జాప్యం చేయడంతో భవిష్యత్ లో గ్రామ అభివృద్ధి పనులు చేయడానికి ముందుకు రాలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వమే కాదు సర్పంచ్‌కి తగిన సహాయ, సహకారాలు స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఉండాలి. కాని వారు కూడా సర్పంచ్‌కి అండగా నిలబడకపోవడంతో దర్జాగా గ్రామపంచాయితీ ఆఫీసులో కుర్చిలో కూర్చొని పనులు చేయించాల్సిన మహిళ ..పత్తి చేనులో దినసరి కూలీ పనులు చేసుకుంటోంది. టీఆర్ఎస్ పాలనలో బంగారు తెలంగాణ అంటే ఇదేనా అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
స్థానిక నేతల సహాయనిరాకరణ..
అభివృద్ధి పనులకు సంబంధించిన చెక్కులపై రెండవ సంతకందారుడు చెక్కుల మీద సంతకం చేయకుండా ఇబ్బంది పెట్టడం, అభివృద్ధికి చేసిన అప్పులపై వడ్డీల భారం పెరగడం వల్ల ఇలాంటి పరిస్థితుల్లో అప్పులు తీర్చడానికి దిక్కుతోచక దినసరి కూలి గా మారాల్సి వచ్చిందని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు సుస్మిత. ఇప్పటికైనా గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేసి గ్రామభివృద్ది కి సహకరించాలని వారు కోరారు.
మండలంలో అందరిది ఇదే పరిస్థితి..
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు 5 నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులు రాక గ్రామ సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదని వాపోయారు సర్పంచ్ సుష్మిత. కరెంట్ బిల్లులు కట్టడం లేదని, పారిశుద్ధ్య పనులకు ఇబ్బంది అవుతుందన్నారు. ట్రాక్టర్‌కు నెలవారి వాయిదాలు, డీజిల్ కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. ఈ పరిస్థితిని ఎవరికి చెప్పాలో తెలియక మండలంలోని సర్పంచ్‌లు మదన పడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahabubabad, Telangana News