రిపోర్టర్: సంతోష్ కుమార్
లొకేషన్: వరంగల్
వారు ప్రాంతం అక్కడో నిరుపేదల దేవుడు కొలువై ఉంటాడు..అక్కడ దేవున్ని చూడాలంటే టికెట్లు ఉండవు..గత 50 ఏళ్లుగా దర్గా కి సమస్యలతో వచ్చే పేదలకు ఉచిత సౌకర్యాలు కల్పిస్తూ ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నాడు మొహమ్మద్ అబ్దుల్ హమీద్ అనే వ్యక్తి.. అసలు ఆ దర్గాగుడి వెనుక ఉన్న చరిత్ర ఏంటి అక్కడ ఎటువంటి వైద్యం అందుతుంది అనేదానిపై న్యూస్ 18 ప్రత్యేక కథనం..
వరంగల్ శివారు ప్రాంతం ఓగులాపుర్ గ్రామంలోని శివారు ప్రాంతంలో సైలని బాబా దర్గా ఉంది. వివిధసమస్యలతో వచ్చే వారికి ఈ దర్గాలో ఉండేందుకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నారు మొహమ్మద్ అబ్దుల్ హమీద్. గత 50 సంవత్సరాలుగా ఈ సేవ చేస్తున్నారు.
ఉన్నతమైన కుటుంబంలో జన్మించిన అబ్దుల్ గతంలో నిజామాబాద్‌లోని ఆర్టీసీలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసారు. 50 సంవత్సరాల క్రితం అతని భార్యకు ఆరోగ్యం క్షీణించింది. మహారాష్ట్రలోని సైలని బాబా దగ్గరికి తీసుకెళ్తే ఆరోగ్యం బాగవుతుందని స్నేహితుడు చెప్పగా తన భార్యను అక్కడికి తీసుకువెళ్లి వైద్యం చేయించాడు.. కొద్ది కాలం తర్వాత ఆరోగ్యం బాగుపడింది.తన భార్య ఆరోగ్యం మెరుగుపడడంతో రుణం ఎలా తీర్చుకోవాలని అక్కడ వారిని కోరగా, నీవు కూడా ప్రజలకు ఇలాంటి సేవ చేయడం వల్ల మంచి జరుగుతుందని తెలిపారు.
సేవ చేసి వారి వద్ద నుండి ఏం ఆశించకూడదని సాయిలని బాబా అబ్దుల్ అమీద్ చెప్ప డమే తడవుగా తన స్వస్థలం అయిన వరంగల్ లోని శివారు ప్రాంతమైన ఓగులాపూర్ గ్రామంలో తన సొంత భూమిలో దర్గాను ఏర్పాటు చేసి అక్కడికి అనేక సమస్యలతో వచ్చే ప్రజలకు ఉచిత సేవలు అందిస్తున్నారు అబ్దుల్.
దర్గాకు ఎన్నో బాధలు, కష్టాలతో వచ్చే నిరుపేదలకు అక్కడ ఉండేందుకు వసతి అందిస్తున్నారు.ఆరోగ్యం బాగా లేని వారు ఇక్కడికి వచ్చి ఉంటే నయమవుతుందని నమ్మకం కల్గడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తుల తాకిడి పెరిగింది..సంతానం లేని వారు ఇక్కడికి వస్తే సంతానం కలుగుతుందని చీడ పీడలు తొలిగిపోతాయని విశ్వాసంతో వచ్చే భక్తులకు అన్ని రకాల సేవలు అందిస్తూ ఖ్యాతి గడిస్తున్నారు అబ్దుల్.
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal