గత వారం రోజులుగా పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న సైదాబాద్ సింగరేణి కాలనీ అత్యాచార(Saidabad rape) నిందితుడు రాజు కాసేపటి క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు, నిందితుడు వరంగల్ జిల్లా(Warangal) స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలోని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది.
సంఘటన వద్ద సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం సమయంలోనే రైల్వే ఉద్యోగులు(ralway) ఇద్దరు కుమార్ మరియు సారంగపాణిలు ఉదయం తమ విధుల్లో భాగంగా రైల్వే ట్రాక్ చెక్ చేసుకుంటూ వెళుతున్న నేపథ్యంలో వారిని చూసిన నిందితుడు రాజు(raju) పారిపోయినట్టుగా సాక్షులు చెబుతున్నారు. దీంతో కాసేపు వెతికినా.. కనిపించకపోవడంతో.. రైల్వే కీమెన్స్ ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్లిపోయినట్టు చెప్పారు.
ఇది చదవండి : భర్తను చున్నితో ఉరిపెట్టింది... 11 ఏళ్ల కొడుకు సాక్ష్యంతో బుక్ అయింది.. !
కాగా రైల్వే ఉద్యోగులు వెళ్లిన కాసేపటి తర్వాత హైదరాబాద్ వైపు వస్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (konark express)కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు చెప్పినట్టు రైల్వే ఉద్యోగులు చెప్పారు. దీంతో నిందితుడిని గుర్తు పట్టిన వారు రైల్వే పోలీసులకు ఫోన్ చేయడంతో పాటు 100 కూడా డయల్ చేసినట్టు చెప్పారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి చేతిపై టాటుతోపాటు మౌనిక అనే పచ్చబొట్టు ఆధారంగా మృతున్ని, రాజుగా గుర్తించినట్టు సమాచారం. మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం (mgm)ఆసుపత్రికి తరలించి పోస్టు మార్టం నిర్వహించిన తర్వాత బంధువులకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది.
ఇది చదవండి : అక్కడ అత్తను కొట్టి.. ఇక్కడ అత్యాచారం చేసిన సైదాబాద్ క్రిమినల్
నిందితుడి కోసం వారం రోజుల పాటు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం మాత్రం కనిపించలేదు. సీసీ కెమెరాలను (cc camera)పరిశీలించిన పోలీసులు ఎల్‌బీ నగర్ నుండి ఉప్పల్ రింగ్ రోడ్డు వైపు వెళ్లినట్టు గుర్తించారు.
దీంతో నిందితుడిని పట్టుకునేందుకు దాదాపు వెయ్యిమంది పోలీసులు వెతుకున్నట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు నిందితుడిని గుర్తు పట్టి సమాచారం అందించడం కోసం ఫోటోను రిలీజ్ చేసి, పలు రైల్వే స్టేషన్‌తో పాటు బస్‌స్టాండ్, ఇతర వైన్స్, రెస్టారెంట్‌లుతోపాటు ఇతర పబ్లిక్ ప్లేస్‌లలో పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఒకటి రెండు రోజుల్లో పట్టుకుంటామని పోలీసులు చెబుతున్న నేపథ్యంలోనే .. పోలీసులకు చిక్కకుండా ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.
మరోవైపు సంఘటనపై పౌరహక్కుల సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. నిందితుడు టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేశారు. పూర్తి సంఘటనపై విచారణ జరిగితే.. అసలు విషయాలు తెలుస్తాయని అంటున్నారు.
ఇది చదవండి : అర్థరాత్రి పురిటి నొప్పులు.. పోలీసు వాహనంలో ప్రసవం
ఇక వినాయక చవితి రోజునే రాజు ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి ఇంట్లోకి తీసుకుళ్లిన నిందితుడు రాజా దారుణానికి పాల్పడ్డాడు. బాలికను చంపి ఇంట్లోనే దాచి పెట్టాడు. అనంతరం ఇంటినుండి జారుకుని పారిపోయాడు. అయితే సంఘటన జరిగిన తర్వాత స్థానికులు అందోళన చేపట్టినా.. పోలీసులు సరైన సమయంలో స్పందించలేదని ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలోనే సంఘటనను నిరసిస్తూ అనేక పార్టీలు , ప్రజా సంఘాల నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించాయి. నిందితున్ని పట్టుకుని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక అధికార పార్టీ మంత్రి మల్లారెడ్డి నిందితున్ని ఎన్‌కౌంటర్ చేయడం ఖాయం అని వ్యాఖ్యానించడ సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే నిందితుడు రైల్వే ట్రాక్‌పై పడి ఉండడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Child rape, Crime news, Hyderabad