Santosh, News18, Warangal.
విద్యారంగంలోనే కాదు వైజ్ఞానిక అంశాల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నారు చిన్నారులు. అందుబాటులోకి వచ్చిన నూతన టెక్నాలజీ పరికరాలు, ఇంటర్నెట్ సేవలలో తమ కలలను నెరవేర్చుకుంటున్నారు. 2019 కోవిడ్ నుండి లాక్ డౌన్ సమయాన్ని ఇంటర్నెట్ సాయంతో కొత్త విద్యా విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. టెక్నాలజీ అంశాలపై పట్టు సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువస్తున్నారు.చిన్న వయసులోనే టెక్నాలజీ రంగాల్లో రాణిస్తున్న బాల సైంటిస్టులపై న్యూస్ 18 ప్రత్యేక కథనం.
వరంగల్ కేంద్రంలోని కొంతమంది చిన్నారులు ఇంటర్నెట్ ద్వారా రోబోల తయారీపై అవగాహన పెంపొందించుకోవడానికి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఎదురుగా ఉన్న క్రియేటివ్ రోబోటిక్స్ లో శిక్షణ తీసుకుంటున్నారు.వివిధ రకాల సెన్సార్ లేకుండా పనిచేసే లేటెస్ట్ పరికరాలు తయారు చేస్తూ రాణిస్తున్నారు. ఇందులో విద్యార్థులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అనేక పోటీల్లో పాల్గొని విజయం సాధించారు.పంట పొలాల్లో పురుగుల మందులు చల్లేలా రోబోలను తయారు చేయాలని తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతో భవిష్యత్తులో రోబోటిక్ ఇంజనీర్ కావాలన్నదే తన లక్ష్యం అంటున్నారు చిన్నారులు.
గత ఐదు సంవత్సరాలుగా క్రియేటివ్ రోబోటిక్స్ ఇన్స్టిట్యూట్లో చేరినప్పటి నుండి రోబోటిక్స్ పై అవగాహన కల్పించి పరికరాలు ఎలా తయారు చేయాలో తమకు బాగా నేర్పించారని ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థి ఆనందాన్ని వ్యక్తం చేశాడు. సొంతంగా ఒక వ్యవసాయ రంగానికి పనికొచ్చే పరికరాన్ని తయారు చేసినట్టు చెప్పిన ఆ విద్యార్థి.. రైతుల కోసం తడిగా ఉన్న భూమిని పొడిగా చేయడానికి.. పొడిగా ఉన్న భూమిని తడిగా చేయడానికి ఒక పరికరాన్ని కనిపెట్టానని చెప్పుకొచ్చాడు.
Breaking News: కాంగ్రెస్ కు గుడ్ బై..బీజేపీ తీర్ధం పుచ్చుకున్న మర్రి శశిధర్ రెడ్డి
నాలుగు సంవత్సరాలుగా క్రియేటివ్ రోబోటిక్స్ ఇన్స్టిట్యూట్ 19 మంది విద్యార్థులతో శిక్షణ తరగతులు మొదలుపెట్టారు. ముఖ్యంగా రోబోటిక్స్ అనేది ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేస్తారు. కానీ తమ ప్రత్యేకత చిన్న పిల్లలకు రోబోటిక్స్ పై చిన్నతనం నుండే అవగాహన కల్పించాలని.. చాలామంది పిల్లల తల్లిదండ్రులు వారి భవిష్యత్తుపై దృష్టి సారించి తమ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తున్నారని ఆ ఇన్స్టిస్టూట్ నిర్వాహుకులు చెప్తున్నారు. ప్రస్తుతానికి 250 మంది విద్యార్థులు ఉన్నారని, ఇతర రాష్ట్రాల్లోనూ, దేశాల్లోనూ ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. ఇలా శిక్షణ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. వివిధ ఈవెంట్స్ లో పిల్లలకు అవార్డ్స్ రావడం గర్వకారణమని.. క్రియేటివ్ రోబోటిక్స్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకురాలు సుకన్య తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal