రిపోర్టర్ : క్రాంతి
లొకేషన్ : వరంగల్
పోలీసుల కథనం ప్రకారం వరంగల్ నగరానికి చెందిన బాలిక నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. నర్సంపేట మండలం మాదన్నపేటకు చెందిన యువకుడు దూడల ప్రభాస్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆత్మకూరు మండలానికి చెందిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న పదహారేళ్ల విద్యార్థిని కొంతకాలంగా నగరంలో ఉంటుంది.
ఈ మేరకు స్నేహితురాలి ద్వారా నర్సంపేట ప్రాంతానికి చెందిన సెల్ ఫోన్ మెకానిక్ దూడల ప్రభాస్ తో పరిచయం ఏర్పడింది. వీరి మధ్య ఏడాదికాలంగా ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. రోజూ లాగానే కళాశాలకు వెళ్లిన బాలిక ప్రభాస్ ను కలిసేందుకు నర్సంపేట బస్ స్టేషన్ కు చేరుకుంది. అక్కడి నుంచి ప్రభాస్ ద్విచక్ర వాహనంపై కిలా వరంగల్ లోని ఉద్యానవనానికి తీసుకువచ్చాడు.
అనంతరం ప్రభాస్ స్నేహితుడైన అవినాష్ కు ఫోన్ చేసి తనకు ఏకాంతంగా గడపాలని సరైన చోటు చెప్పమని కోరాడు. దానికి అవినాష్ చోటు గురించి ప్రభాస్ కు చెప్పి మరో స్నేహితుడు భరత్ కి ఫోన్ చేశాడు. అందరూ ప్రభాస్ ఉన్న చోటు కిలా వరంగల్ కు చేరుకున్నారు. ఆ తర్వాత బాలికను కిలా వరంగల్ శివారు ప్రాంతమైన దూపకుంట రోడ్డులో ఉన్న టేకు చెట్ల వద్దకు తీసుకెళ్లారు. ప్రభాస్ బాలికతో సమయంగడిపి బయటకు వచ్చిన తర్వాత అక్కడే ఉన్న ప్రభాస్ స్నేహితులు ఆ బాలికను బెదిరించి ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి ఒడిగట్టారు.
అర్ధరాత్రి అయినా తన కూతురు ఇంటికి రాకపోవడంతో బాలిక తండ్రి తెలుసుకొని ప్రభాస్ తల్లిదండ్రులను ఆరా తీయగా ప్రభాస్ బాలికను వారి ఇంటి వద్ద వదిలిపెట్టాడు. అనంతరం బాలిక జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలపగా బాలిక తండ్రి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అత్యాచారానికి పాల్పడిన నలుగురిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal