హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: తండ్రి చిరంజీవి ముందే రామ్ చరణ్ వార్నింగ్.. మంత్రి రోజాకేనా..?

Warangal: తండ్రి చిరంజీవి ముందే రామ్ చరణ్ వార్నింగ్.. మంత్రి రోజాకేనా..?

Warangal: తండ్రి చిరంజీవి ముందే రామ్ చరణ్ వార్నింగ్.. మంత్రి రోజాకేనా..?

Ramcharan comments: కొన్ని రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ మె ఫ్యామిలీని టార్గెట్ చేశారు రోజా. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ .. ముగ్గురు అన్నాదమ్ముళ్లపై విమర్శలు గుప్పించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India

సంక్రాంతికి విడుదలై బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న వాల్తేరు వీరయ్య (waltair veerayya) విజయోత్సవ వేడుక శనివారం సాయంత్రం వరంగల్ జిల్లా హన్మకొండలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి (Chirajeevi)తో పాటు రామ్‌చరణ్ (Ram Charan), ఇతర నటీ నటులు, దర్శక నిర్మాతలు హాజరయ్యారు. ఐతే సభా వేదికగా రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తన తండ్రి సైలెంట్‌గా ఉంటాడేమో గానీ.. ఆయన వెనక ఉన్న తాము సైలెంట్‌గా ఉండమని అన్నారు. ఆయన కొంచెం గట్టిగా మాట్లాడితే.. ఏం జరుగుతుందో.. కొంత మందికి తెలియదని వ్యాఖ్యానించారు. ఐతే రామ్ చరణ్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని.. జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల ఏపీ మంత్రి, సినీ నటి రోజా (RK Roja).. మెగా ఫ్యామిలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మెగా ఫ్యామిలీ ఏమీ చేయలేదని.. అందుకే ప్రజలు ఓడించారని విమర్శించారు. ఈ నేపథ్యంలో రోజాకు కౌంటర్‌గా రామ్ చరణ్ ఈ వ్యాఖ్యలు చేశారని.. మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు.

 Sai Dharam Tej: తారకరత్న కండిషన్ సీరియస్.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్

'' చిరంజీవిని ఎవరైనా ఏదైనా అనాలంటే.. అది కేవలం అభిమానులు, కుటుంబ సభ్యులు మాత్రమే అనగలగాలి. సాధారణంగా చిరంజీవి నిశ్శబ్ధంగా ఉంటారు. బాగా సౌమ్యులు అని అంటుంటారు. ఆయన క్వైట్‌గా ఉంటేనే ఇంత మందిమి వచ్చాం. అదే ఆయన కొంచెం బిగించి..గట్టిగా మాట్లాడితే.. ఏమవుతుందో ఇతరులకు తెలియదు. ఆయన సైలెంట్‌గా ఉంటాడేమో. గుర్తు పెట్టుకోండి..వెనకాల ఉన్న మేమే మౌనంగా ఉండము. మేం అందరం ఉన్నాం. మేం క్వైట్‌గా ఉండము అని.. క్వైట్‌గానే చెబుతున్నాం. అని వరంగల్ సభలో రామ్ చరణ్ అన్నారు.

Tarakaratna Health: కోమాలో నందమూరి తారకరత్న

కాగా, కొన్ని రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ మె ఫ్యామిలీని టార్గెట్ చేశారు రోజా. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ .. ముగ్గురు అన్నాదమ్ముళ్లపై విమర్శలు గుప్పించారు. సొంత జిల్లాలోనే ప్రజలు ఓడించారంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం అర్థమవుతోందని రోజా అన్నారు. సాధారణంగా సినీ నటులు సెన్సిటివ్‌గా ఉంటారని.. అందరికీ సాయం చేస్తారని కానీ వీళ్లు మాత్రం అందుకు భిన్నమని రోజా విమర్శించారు. ఏ ఒక్కరికీ ఎలాంటి సాయం చేయలేదని మండిపడ్డారు. అందుకే రాజకీయాల్లో వీరిని ప్రజలు ఆదరించలేదని ఎద్దేవా చేశారు ఆర్కే రోజా.

మంత్రి రోజా వ్యాఖ్యలకు వెంటనే మెగా బ్రదర్ నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రోజా పర్యాటక మంత్రి అయ్యాక.. పర్యాటక రంగంలో ఏపీ ర్యాంక్ 18వ స్థానానికి పడిపోయిందని విమర్శించారు నాగబాబు. వైసీపీ వచ్చాక పర్యాట రంగంపై ఆధారపడి ఉన్న ప్రజలు రోడ్డునబడ్డారని అన్నారు. తమపై విమర్శలు మానుకొని.. ముందు ఏపీ పర్యాటక రంగంపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. రోజా నోటికి మున్సిపాలిటీ కుప్ప తొట్టికి తేడా లేదని.. అందుకే ఇన్నాళ్లు ఆమె ఏం మాట్లాడినా స్పందిచ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు నాగబాబు. ఆ తర్వాత మళ్లీ నాగబాబుపై రోజా విరుచుకుపడడం.. ఇండస్ట్రీలో కొందరు సినీ నటులు మెగా ఫ్యామిలీకి అండగా నిలబడడం జరిగాయి.

ఆ తర్వాత చిరంజీవి కూడా రోజా వ్యాఖ్యలపై స్పందించారు. ఆమెతో తనకైతే ఎలాంటి గొడవలు లేవని అన్నారు. ఏపీలో మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత కూడా..రోజా తన ఇంటికి కూడా వచ్చి కలిసి వెళ్లారని చెప్పారు. ఆ విషయం అందరికీ తెలుసని అన్నారు. రోజా ఎందుకు అలా మాట్లాడారో ఆమెనే అడగాలంటూ కామెంట్ చేశారు చిరంజీవి. అంతకు మంచి ఏమీ అనలేదు. కానీ శనివారం వరంగల్‌లో జరిగిన వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో మాత్రం... రామ్ చరణ్ గట్టిగా మాట్లాడారు. రోజా పేరెత్తకుండానే.. క్లాస్‌గా వార్నింగ్ ఇచ్చారు. తన తండ్రి క్వైట్‌గా ఉంటారు గానీ.. తాకు క్వైట్‌గా ఉండమని స్పష్టం చేశారు.

First published:

Tags: Local News, Ram Charan, Roja, Tollywood, Warangal

ఉత్తమ కథలు