హోమ్ /వార్తలు /తెలంగాణ /

God without Temple: గుడి లేదు.. గోపురం లేదు.. కానీ అక్కడ దేవుడు ఉన్నాడు.. ఆ దేవున్ని దర్శించాలంటే సాహసం చేయాల్సిందే..!

God without Temple: గుడి లేదు.. గోపురం లేదు.. కానీ అక్కడ దేవుడు ఉన్నాడు.. ఆ దేవున్ని దర్శించాలంటే సాహసం చేయాల్సిందే..!

X
కొండల

కొండల మధ్య వెలసిన లింగం

గుడి లేదు గుడి గోపురం లేదు కానీ గుండాల మధ్యలో ఓ లింగం వెలిసింది. ఆ స్వామిని దర్శించుకోవాలంటే సాహసం చేయాల్సిందే. ఎలాంటి ఆహార్యం ఉన్నవాళ్లైనా సరే..రెండు కొండల మధ్య నుంచి దూరి వెళ్లాల్లిందే.. ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడుందంటే..

(Pranay Diddi, News 18, Warangal)

Warangal temples: ప్రతి ఆలయానికి ఏదో ఒక చరిత్ర ఉంటుంది. ఏదో ఒక విశిష్టత కూడా ఉంటుంది. అలాంటి ఆలయాలు వరంగల్ (Warangal) జిల్లాలో అనేకం ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయం (temple) వరంగల్ జిల్లాలోని అసన్ పర్తి మండల్ మడిపల్లి (Madipalli, Warangal) అనే గ్రామ శివారులో ఉంది. గృహలో శ్రీ రాజరాజేశ్వర స్వామి (Rajarajeshwara Swamy) శివలింగం ఉంటుంది.

ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు

కొన్ని సంవత్సరాల క్రితం ఒక గొర్రెల కాపరి రూపంలో స్వామి వచ్చి…. ఈ గుహలో లింగం ఉందని చెప్పినట్లు ఆ గ్రామస్తులు చెబుతూ ఉంటారు. నాటి నుంచి నేటి వరకు ఈ గుహలో ఉన్న లింగానికి ప్రతి సోమవారం పూజలు నిర్వహిస్తారు. దీప ధూప నైవేద్యాలతో స్వామివారిని అభిషేకిస్తారు.

రెండు కొండల మధ్య నుంచి వెళ్లాలి

ఈ ఆలయాన్ని (Temple) చాలా ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో ఉన్న శివున్ని దర్శించుకోవాలి అంటే రెండు కొండల మధ్య నుండి దూరి వెళ్లాలి. ఎలాంటి ఆహార్యం ఉన్నవాళ్లైనా సరే అలానే వెళ్లి స్వామి వారిని దర్శించుకోవాలి. ఎంత లావుగా ఉన్నవారైనా సరే భక్తితో శివ..శివ అంటే చాలు…ఆ చిన్న సందులో ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్తారని ఇక్కడి ప్రజల నమ్మకం.

కోరిక కోర్కెలు తీర్చే కొంగుబంగారం

ఈ స్వామి వారికి ఎవరైతే అభిషేకం చేస్తారు వారి మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అందుకోసమే ప్రతి సోమవారం స్వామివారికి అభిషేకం పూజలు నిర్వహిస్తారు. అలా నిర్వహించే వారి కోరికలు తీరుతాయని ఇక్కడి భక్తుల అపూర్వ నమ్మకం..

నీటి కోనేరు

ఈ ఆలయం పక్కనే ఒక చిన్న నీటి కోనేరు ఉంటుంది. ఏ కాలంలో అయినా ఇందులో నీళ్లు ఉండడం విశేషం. ఈ కోనేరు లోని నీటితోనే స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు.

ఆలయ వివరాలు.:

తెరిచి ఉంచే సమయం: ఈ ఆలయం ప్రతి సోమవారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ రోజు పలు ప్రదేశాల నుండి భక్తులు వచ్చి స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు.

సోమవారం రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు ఉంటాయి ప్రత్యేక పూజల కోసం ఎటువంటి చెల్లింపులు చెల్లించిన అవసరం లేదు. ఆలయ పూజారికి మీకు తోచినంత ఇవ్వొచ్చు అంతేకాకుండా ఆలయ అభివృద్ధి కోసం ఏమైనా సహాయం కూడా చేయవచ్చు.

మహాశివరాత్రి చాలా ప్రత్యేకం

ప్రతి మహాశివరాత్రి రోజున ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు ఉంటాయి. అంతేకాకుండా జాగారం కూడా చేస్తారంట. శ్రీ రామ నవమి రోజు సీతారాముల కళ్యాణం జరుగుతుంది.

First published:

Tags: Local News, Temple, Warangal

ఉత్తమ కథలు