హోమ్ /వార్తలు /తెలంగాణ /

వాళ్లిద్దరూ ప్రాణస్నేహితులు.. ఎక్కడ చెడాలో అక్కడ చెడింది.. కట్ చేస్తే..!

వాళ్లిద్దరూ ప్రాణస్నేహితులు.. ఎక్కడ చెడాలో అక్కడ చెడింది.. కట్ చేస్తే..!

హన్మకొండలో యువకుడి దారుణ హత్య

హన్మకొండలో యువకుడి దారుణ హత్య

ఇచ్చిన డబ్బులు అడిగినందుకు దగ్గర బంధువు అని చూడకుండా ఓ రైల్వే ఉద్యోగి సహచర ఉద్యోగిని దారుణంగా హత్య చేసిన ఘటన హనుమకొండ జిల్లా (Hanmakonda District) కాజీపేట శివారు ప్రాంతం కడిపికొండ లో చోటుచేసుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Telangana

Santosh, News18, Warangal

ఇచ్చిన డబ్బులు అడిగినందుకు దగ్గర బంధువు అని చూడకుండా ఓ రైల్వే ఉద్యోగి సహచర ఉద్యోగిని దారుణంగా హత్య చేసిన ఘటన హనుమకొండ జిల్లా (Hanmakonda District) కాజీపేట శివారు ప్రాంతం కడిపికొండ లో చోటుచేసుకుంది. కాజీపేట అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ వివరాల ప్రకారం కడిపికొండకు చెందిన ప్రదీప్, వినయ్ లు మంచి స్నేహితులు.రైల్వేలో సహచర ఉద్యోగాలుగా కూడా పనిచేస్తున్నారు. ప్రదీప్.. వినయ్ కుమార్కు ఐదేళ్ల క్రితం5 లక్షలు అప్పుగా ఇచ్చాడు. తిరిగి ఇవ్వాలని కోరగా వినయ్ కుమార్ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. దీంతో వినయ్ కుమార్.. ప్రదీప్ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన మిత్రుడు గోపితో కలిసి స్కెచ్ వేశారు. ఆ పక్కా ప్లాను ప్రకారం తెల్లవారుజామున వీధుల్లో ఉన్న ప్రదీప్ను గ్రామ శివారుకు వచ్చేలా చేశారు.

ముగ్గురు కలిసి మద్యం తాగారు. మద్యం మత్తులోకి జారుకున్న ప్రదీప్ ను.. వినయ్, గోపీలు...వెంట తెచ్చుకున్న గొడ్డలితో అతన్ని తలపై వెనుక నుంచి నరికి అక్కడి నుండి పారిపోయారు. నిర్మానుషమైన ప్రదేశం కావడంతో ప్రదీప్ ఎంత అరిచినా ఎవరికి వినపడలేదు. అయితే అప్పుడేఅటువైపు బహిర్బుమికి వెళ్తున్న స్థానికుడు యుగేందర్ అతన్ని చూసి తన స్నేహితులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న యుగేందర్ స్నేహితులకుప్రదీప్ జరిగిన విషయాన్ని తెలియజేశారు.

ఇది చదవండి: రూ.30వేల కోసం ఘాతుకం.. కన్నప్రేమను మరిచిన కసాయి

వెంటనే యుగంధర్ తన స్నేహితులు కలిసి పోలీసులకు సమాచారం అందించారు, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారి కుటుంబానికి సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికేకొన ఊపిరితో ఉన్న ప్రదీప్ ను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అప్పటికే తీవ్ర రక్తస్రావం ఎక్కువగా కావడంతో అతడు ఆసుపత్రిలో మృతి చెందాడు. దీంతో ప్రదీప్ తల్లిదండ్రులు, భార్య కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ సంఘటనా స్థలాన్ని కాజీపేట అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కాజీపేట ధర్మసాగర్ పోలీస్ ఇన్స్పెక్టర్లు సందర్శించి ఆధారాలను సేకరించారు మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు