హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mirchi record price: బంగారం ధరను క్రాస్ చేసిన ఎర్రబంగారం .. క్వింటా ధర ఎంతో తెలుసా

Mirchi record price: బంగారం ధరను క్రాస్ చేసిన ఎర్రబంగారం .. క్వింటా ధర ఎంతో తెలుసా

Mirchi Price(FILE PHOTO)

Mirchi Price(FILE PHOTO)

Mirchi record price: లోహాల్లో బంగారానికి ఎంత విలువ ఉందో ..రైతు సాగు చేసే పంటల్లో మిర్చికి అండే డిమాండ్ ఉంది. అందుకే ఎప్పుడో ఒకటి రెండు సార్లు మిర్చి రేటు కాస్త తగ్గినప్పటికి సీజన్‌ టైమ్‌లో మాత్రం మోత మోగిస్తోంది. ఇప్పుడు గోల్డ్ ధరను క్రాస్ చేసి ఆల్‌ టైమ్‌ హైకి చేరింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  (P.Srinivas,New18,Karimnagar)

  లోహాల్లో బంగారానికి ఎంత విలువ ఉందో ..రైతు సాగు చేసే పంటల్లో మిర్చి(Mirchi)కి అండే డిమాండ్ ఉంది. అందుకే ఎప్పుడో ఒకటి రెండు సార్లు మిర్చి రేటు కాస్త తగ్గినప్పటికి సీజన్‌ టైమ్‌లో మాత్రం మోత మోగిస్తుంది. ఈ సంవత్సరం వ్యవసాయ సీజన్ ప్రారంభం అయిన నాటి నుండి మిర్చి ధర బంగారంతో పోటీ పడుతూ వచ్చింది. ఇప్పుడు బంగారం ధరను క్రాస్ చేసింది. వరంగల్ (Warangal) ఎనుమాముల మార్కెట్‌(Enumamula Market)లో ఆల్‌ టౌమ్‌ హైక్‌ చేరుకున్న మిర్చి రేటు మరో రికార్డ్ బ్రేక్ చేసింది. గోల్డ్‌(Gold)రేట్‌ని అధిగమించడంతో పాటు సరికొత్త రికార్డ్‌ని సొంతం చేసుకుంది.

  Raja Singh wife: బీజేపీ అధిష్టానానికి ఎమ్మెల్యే రాజాసింగ్​ సతీమణి లేఖ.. ఏం రాశారంటే..?  ఆల్‌ టైమ్ హైకి మిర్చి రేటు..

  వరంగల్ జిల్లాలోని  అతి పెద్ద మార్కెట్ అయినటువంటి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటా మిర్చి ధర 66 వేల రూపాయలు పలికింది. సాగు పంటల్లో మిర్చిని ఎర్రబంగారంగా కొలిచే రైతులకు సిరులు కురిపిస్తోంది. అంతే కాదు సాగు చరిత్రలో ఇదే ఆల్ టైమ్ రికార్డ్ కావడం విశేషమని మార్కెట్ వర్గాలు, రైతులు సంతోషంగా చెబుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డుల్లో ఒకటైన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈ రికార్డ్ ధర నమోదైంది.

  గోల్డ్‌ రేటుతో పోటీ పడ్డ రెడ్‌ గోల్డ్..

  ఈసంవత్సరం వ్యవసాయ సీజన్ ఆరంభం నుండి పసిడితో పోటీ పడిన ఎర్రబంగారం ధరలు ఇప్పుడు బంగారం ధరను అధిగమించింది. వరంగల్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటా మిర్చికి 66 వేల రూపాయల రికార్డు ధర లభించింది. టమాట రకం మిర్చికి ఈ ధర లభ్యమైంది. దుగ్గొండి మండలం మరిపెళ్లి గ్రామానికి చెందిన యార రవి అనే రైతు తను సాగుచేసిన 24 బస్తాల టమాట రకం మిర్చిని కోల్డ్ స్టోరేజ్‌లో భద్రపరిచాడు. ఆ మిర్చిని శుక్రవారం విక్రయించడంతో ఈ రికార్డు ధర పలికింది.

  రాజధాని టికెట్ తో గరుడా బస్సుల్లో ప్రయాణించే ఛాన్స్.. ప్రయాణికులకు TSRTC బంపరాఫర్..  రైతుల కళ్లలో ఆనందం..

  మిర్చి పండించిన రైతు యార రవి తన పంటకు రికార్డ్ స్థాయిలో ధర పలకడంపై ఆనందం వ్యక్తం చేశారు. మన దేశంతో పాటు విదేశాల్లో కూడా ఈ మిర్చికి బాగా డిమాండ్ ఉంది. ఈనేపథ్యంలో ధరలు విపరీతంగా పెరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువగా దేశీయ మిర్చిని పండిస్తారు. అకాల వర్షాలు, వైరస్ కారణంగా ఈ ఏడాది మిర్చి పంట తీవ్రంగా దెబ్బతింది. దీంతో పంట దిగుబడి బాగా తగ్గింది. కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ ఉంచిన మిర్చికి ఇప్పుడు రికార్డ్ ధర పలికడం రైతులు కళ్లలో ఆనందం కనిపిస్తోంది. గతంలో కూడా ఇక్కడ పత్తి ధర కూడా అత్యధిక రేటు పలికింది. తెలంగాణా రాష్టంలోనే పత్తి, మిర్చికి ఎనమాముల మార్కెట్ పెట్టింది పేరు. వరంగల్ చుట్టు పక్కల జిల్లాలకు ఇదే పెద్ద మార్కెట్ కావడం విశేషంగా చెప్పాలి.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Mirchi market, Telangana News, Warangal

  ఉత్తమ కథలు