(K.Santhosh, News 18, Warangal)
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజల నడ్డివిరిస్తోంది. నిత్యవసర ధరలు, గ్యాస్(Gas),పెట్రోల్(Petrol),డీజీల్ (Diesel)వంటి ధరలను ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తమ ఆదాయానికి మించి ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని గగ్గోలు పెడుతున్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం ఆ ధరలను తగ్గించే పాపాన పోలేదు కదా... ఇంకా వారి నెత్తి మీద ఏదో ఒక ధరలు పెంచుతునే పోతున్నారు. ఇందుకు ఆ జిల్లా ప్రజలు రోడ్డు ఎక్కి..ఆందోళనలు చేస్తున్నారు.
వరంగల్‌లో వినూత్న నిరసన..
వరంగల్ జిల్లా కేంద్రంలో పెరిగిన పెట్రోల్ వంటగ్యాస్ ధరలకు సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో సుమారు 300 మంది మహిళలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకువ్యతిరేకంగా గ్యాస్ సిలిండర్ నెత్తిన పెట్టుకొని ఆటోను లాగుతూవినూత్న నిరసన చేపట్టారు. సిలిండర్లను నెత్తిన పెట్టుకొని రోడ్డుపై వంటలు చేస్తు మరొకవైపు ఆటోలను తాళ్లతో లాగుతూ నిరసన తెలిపారు. మోదీప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్, ఇంధనధరలు అధికంగా పెంచారనిమండిపడ్డారు . సామాన్యుడి నడ్డి విరిగేలా చమురు ధరలు పెంచుతున్నారని ఆక్షేపించారు సామాన్య ప్రజలంతా గ్యాస్ వాడే పరిస్థితి లేకుండా ధరలు పెరిగాయనిఆరోపించారు.
తాళ్లు కట్టి వాహనాలు లాగిన డ్రైవర్లు..
డీజిల్ ధరలు వంద రూపాయలపైన చేరుతాయని ఎవరు ఊహించలేరు అన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ పెరుగుదలను నిరసిస్తూ వరంగల్ కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం మహిళలతో నిర్వహించారు.పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని వరంగల్ కేంద్రంలోని కాశిబుగ్గ ప్రాంతం నుండి పోచమ్మ మైదాన్ వరకు ర్యాలీ నిర్వహించారు.
మహిళల మానవహారం..
పోచమ్మ మైదాన్ జంక్షన్లో మహిళలతో మానవహారం నిర్వహించారు. పేద, మధ్య తరగతి ప్రజలు గ్యాస్ వాడాలంటే ఇబ్బందికరంగా ఉంటుందని గ్యాస్ ధరలు రూ.1300 కావడంతో కట్టెలపై వండుకోవాల్సి వస్తుందని మరి ద్విచక్ర వాహనంపై తిరిగేవారైతే మోటార్ సైకిల్లను పక్కకు పడవేసి సైకిల్పై తిరగాల్సిన పరిస్థితి వచ్చిం.ది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాగ్దానాలతో ధరలు నియంత్రించేలా చర్యలు ఇకనైనా చేపట్టకపోతే దేశవ్యాప్తంగా సమ్మెలు చేపడతామని దేశ వ్యాప్తపోరాటం చేపడతామని హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana News, Warangal