(Santhosh, News 18, Warangal)
రెండున్నర ఏళ్ల వివాహ జీవితం ,18 నెలల కుమార్తె, నాలుగు నెలల గర్భం. మొత్తానికైతే ఎంత ఘోరం జరిగిందో... కళ్ళ ముందు 18 నెలల కుమార్తె 4 నెలల గర్భిణి ఎన్నో ఆశలు సంతోషంగా సంసారం సాగుతుందనుకున్న జీవితం అదనపు కట్నం వేధింపులతో చిన్నా భిన్నమైంది తరచూ గొడవలు ఆమెను మనశ్శాంతిగా ఉండనివ్వలేదు. తీవ్ర మనస్థాపానికి గురై మొత్తానికి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం జూమ్ల తండాలో చోటుచేసుకుంది
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూమ్ లతండకు చెందిన జాటోతు మహేష్ కు రెండేన్నరేళ్ల కిందట ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జోగులపాడు గ్రామానికి చెందిన ప్రత్యూషతో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో అన్ని లాంఛనాలు చెల్లించారు. కొంతకాలం మీరు కాపురం బాగానే సాగింది. మధ్య మధ్యలో ఆదరణ పథకం వేధింపులు ఆ మహిళను ఆందోళనకు గురిచేసిన అప్పటికే పుట్టిన కుమార్తెనుచూసుకుంటూ ఆ బాధలన్నీ మరిచిపోయేందుకు ప్రయత్నించింది.
త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నానని సంతోషం ఆమెలో ఎన్నో ఆశలని చిగురింపజేసింది . అదనపు కట్నం కోసం అత్తింటి వారి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగి బలవన్మరణానికిప్రయత్నించింది. ఇంటికి వచ్చిన భర్త... భార్యను అపస్మారక స్థితిలో చూసి చుట్టుపక్కల వారికి సమాచారం అందించి చికిత్స నిమిత్తం ఖమ్మం కు తరలించారు అక్కడ చికిత్స పొందుతూ సాయి ప్రత్యూష మృతి చెందింది.
తన కూతురిది సహజమరణం కాదని వరకట్నంపై వేధింపులు తాళలేక చనిపోయిందంటూ మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal