హోమ్ /వార్తలు /తెలంగాణ /

New Technology: ఇక వర్షాకాలంలోనూ రోడ్లపై నీరు నిలవదు.. కొత్త రకం రోడ్ల తయారీ.. వివరాలివే

New Technology: ఇక వర్షాకాలంలోనూ రోడ్లపై నీరు నిలవదు.. కొత్త రకం రోడ్ల తయారీ.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారీ వర్షాలు కురిస్తే రోడ్ల (Roads)పై నీళ్లతోపాటు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితికి చెక్‌ పెట్టేందుకు ఎన్​ఐటీ టీం ఓ కొత్త పద్దతి (New Technology)పై పరిశోధనలు చేస్తున్నారు. 

వర్షాకాలంలో (Monsoon) రోడ్ల పరిస్థితి అందరికీ తెలిసిందే. ఏ చిన్నపాటి వాన కురిసినా రోడ్లపై నీళ్లు (Water on roads) నిలుస్తాయి. వచ్చిపోయే వాహనాలతోపాటు పాదచారులకూ నరకమే. అదే భారీ వర్షాలు కురిస్తే రోడ్ల (Roads)పై నీళ్లతోపాటు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితికి చెక్‌ పెట్టేందుకు ఎన్​ఐటీ టీం ఓ కొత్త పద్దతి (Porous Asphalt method )పై పరిశోధనలు చేస్తున్నారు.  ఈ మేరకు ‘వరంగల్‌ నిట్‌ (Warangal NIT) కాలేజీ నిపుణులు పోరస్‌ ఆస్ఫాల్ట్‌ (Porous Asphalt method )’ రోడ్లు, పేవ్‌మెంట్ల నిర్మాణంపై పరిశోధనలు చేస్తున్నారు. నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు ఇంకిపోయే ఈ తరహా రోడ్లను విదేశాల్లో పలుచోట్ల ఇప్పటికే వినియోగిస్తున్నారు.

ఈ రోడ్ల గురించి ఒకసారి పరిశీలిస్తే.. సురక్షితమైన ప్రయాణానికి వీలు కల్పించే తారు, సీసీ రోడ్డు మాదిరిగానే ‘పోరస్‌ ఆస్ఫాల్ట్‌’ రోడ్డు ఉంటుందట. సాధారణంగా తారు, సీసీ రోడ్లను నాలుగు దశల్లో మట్టి, కంకర, తారు లేదా సిమెంట్‌ వినియోగించి నిర్మిస్తారు. ఇవి పూర్తిగా గట్టి పొరలా ఉండిపోయి.. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలుస్తాయి. ‘పోరస్‌ ఆస్ఫాల్ట్‌ (Porous Asphalt method )’ పేవ్‌మెంట్‌/రోడ్డును 16 దశల్లో వేర్వేరుగా నిర్మిస్తారు. వివిధ పరిమాణాల్లో ఉన్న కంకరను వినియోగిస్తారు. రోడ్డు దృఢంగా ఉంటూనే.. పెద్ద సంఖ్యలో చిన్నచిన్న రంధ్రాలు ఏర్పడేలా చేస్తారు. నీటి ప్రవాహానికి తగినట్టుగా రంధ్రాలు ఉండేలా చూస్తారట.

ఇక వర్షాలు పడినప్పుడు ఈ రోడ్లు నీటిని పీల్చుకుని భూగర్భంలోకి పంపేస్తాయట. వెంట వెంటనే నీళ్లు ఇంకిపోవడం వల్ల నిల్వ ఉండటం, ముంపునకు కారణం కావడం వంటివి ఉండవు. పట్టణాల్లో ఇలాంటి రోడ్లు/పేవ్‌మెంట్లను నిర్మించినప్పుడు వాటి దిగువ నుంచి నీళ్లు డ్రైనేజీల్లోకి వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేస్తారు. దానితో ఎంతగా వానపడ్డా నీళ్లు నిలవవట.

ఆవిష్కరణలకు కేంద్రం తెలంగాణ..

ప్రస్తుతం పట్టణాలు, మహానగరాల్లో ట్రాఫిక్ సమస్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ట్రాఫిక్లో చిక్కుకున్నపుడు మన వాహనం మేఘాల్లో ఎగిరితే ఎంత బావుంటుందో అనే ఊహ ఎంతో ఆనందాన్నిస్తుంది. అదే నిజమైతే ఎలా ఉంటుంది? ఆ నిజాన్నే మన ముందుంచేందుకు ఐఐటీహెచ్ (IITH) పీహెచ్ స్కాలర్ పర్సనల్ ఏరియల్ వెహికిల్ నమూనాలను రూపొందించారు. ప్రాక్టీస్ బేస్డ్ పీహెచ్​డీ (Ph D) చేస్తున్న స్కాలర్ ప్రియ బ్రత రౌత్రే (Scholar Priya Brata Routhre). డిజైన్ డిపార్ట్మెంట్ హెచ్పీడీ ప్రొఫెసర్ దీపక్ జాన్ మాథ్యూ సహకారంతో ఆస్ట్రేలియాలోని స్పిన్బన్ యూనివర్సిటీ పరిశోధకులతో కలిసి వీటికి రూపకల్పన చేశారు. ఐదేళ్ల నుంచి పరిశోధనలు జరిపి స్వయం ప్రతిపత్తితో నడిచే పర్సనల్ ఏరియల్ వెహికిల్ (Personal aerial vehicle) 45 నమూనాలను రూపొందించారు. ఈ పీఏవీలలో (PAV) ఒకరు లేదా ఇద్దరు సులభంగా ప్రయాణించేలా డిజెన్లను తయారు చేశారు.

First published:

Tags: Monsoon, New technology, Nit, Rains, Warangal

ఉత్తమ కథలు