Santosh, News18, Warangal
నకిలీ కాంట బిల్లుల ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తూ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకు గండి కొడుతున్న ఘరానా ముఠాను వరంగల్ పోలీసులు (Warangal Police) అరెస్ట్ చేశారు. కరీంనగర్ (Karimnagari), ఖమ్మం (Khammam), వరంగల్ జిల్లా (Warangal District) లలో నకిలీ వేయింగ్ బిల్లులతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 14 మంది నిందితులను అరెస్ట్ చేశారు. కాగా మరో నలుగురు పరారీలో ఉన్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సిపి రంగనాథ్ తెలిపారు. ఇందులో ములుగు జిల్లా పేరూరు గ్రామానికి చెందిన లారీ ఓనర్ షేక్ ఇమ్రాన్, హైదరాబాద్ ఉప్పల్ కి చెందిన లారీ ఓనర్ గంట ప్రదీప్ రెడ్డి, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లికి చెందిన లారీ డ్రైవర్ వెంకటేష్, యాదాద్రి జిల్లా పుట్టపాక గ్రామానికి చెందిన ఏదుల కిరణ్ కుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సిపి రంగనాథ్ తెలిపారు.
పదిమంది నిందితులను వరంగల్ టాస్క్ ఫోర్స్ మట్టేవాడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 16 లారీలు, 11 సెల్ ఫోన్లు, 65 నకిలీ బిల్లులను, 40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ పూర్తి వివరాలను వెల్లడించారు. గత కొంతకాలంగా పోలీసులకు వచ్చిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ మట్టేవాడ పోలీసులు నకిలీ బిల్లులు తయారు చేస్తున్న కిరణ్ కుమార్ ను అదుపులోకి తీసుకోవడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. మూడేళ్లుగా టీఎస్ఎండిసికి సంబంధించిన నకిలీ వే బిల్లులు తయారు చేస్తూ లారీ యజమానులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 1700 వరకు తయారుచేసి ఇచ్చినట్లుగా విచారణలో వెల్లడించినట్లు తెలిపారు.
అదే క్రమంలో అతనికి పరిచయమైన సందీప్ రెడ్డి, రాజగోపాల్ గౌడ్, చరణ్ గౌడ్, ఇమ్రాన్లకు నకిలీ వే బిల్లులు అందజేస్తూ అక్రమాలకు పాల్పడినట్లు తెలిపారు. నకిలీవే బిల్లులు వీరు వాడుకోవడమే కాకుండా ఇతర లారీ యజమానులకు ఇచ్చేవారని తెలిపారు. లారీ యజమానులు వాటిని ఉపయోగించే ములుగు, భూపాలపల్లి, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ ప్రభుత్వ ఖజానాకు రావలసిన కోట్ల ఆదాయాన్ని కొల్లగొట్టారని అన్నారు. అందిన సమాచారం మేరకు పోలీసులు 14 మంది నిధులలో పది మందిని అరెస్టు చేయగా.. మిగతా నలుగురు పరారీలో ఉన్నట్టు తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితులపై మట్టేవాడ కాకతీయ యూనివర్సిటీ ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Sand mafia, Telangana, WARANGAL DISTRICT