Home /News /telangana /

WARANGAL POLICE HAVE ARRESTED WHO MADE FAKE EDUCATION CERTIFICATES IN WARANGAL VRY KMM

Warangal : ఫేక్ సర్టిఫికెట్స్‌తో విదేశాలకు.. తయారి ముఠా అరెస్ట్..

warangal crime

warangal crime

Warangal : దేశంలో గుర్తింపు కలిగిన యూనివర్శిటీల నకిలీ సర్టిఫికెట్లను తయారుచేసి వాటి ద్వారా విద్యార్థులను విదేశాలకు తరలిస్తున్న ముఠాను మంగళవారం వరంగల్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

    విదేశాల్లో చదవాలనుకునే వారి వీక్‌నెస్‌ను ఆసరా చేసుకున్న కొన్ని ముఠాలు కన్సల్టెంట్స్ పేరుతో అక్రమ దందాకు తెరతీశారు. ముఖ్యంగా విదేశీ విద్యను అభ్యసించేందుకు పలు రకాల నిబంధనలు ఉండడం ముఖ్యంగా మెరిట్ స్టూడెంట్స్‌కే అక్కడ అవకాశాలు లభిస్తుండడంతో ఈ ముఠాకు పెట్టుబడిగా మారింది. ఈ క్రమంలోనే విదేశీ నిబంధనలకు అనుగుణంగా ఫేక్‌ సర్టిఫికెట్స్‌ను తయారు చేసి స్టూడెంట్స్‌కు ఇస్తున్నారు. అయితే తతంగమంతా కన్సల్‌టెంట్స్‌ నుండే కొనసాగడం కొసమెరుపు. ఇలా కన్సల్టెంట్స్‌ విదేశీ నిబంధనలకు అనుగుణంగా లేని విద్యార్థులు వారిని సంప్రదించడం ద్వారా వారి ఆశలకు అనుగుణంగా ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేయడం దీనికి తోడు ఫస్ట్ క్లాస్‌తో పాటు ఉన్నత మార్కులు కరెక్షన్ ‌చేసి అందుకు అనుగుణంగా సర్టిఫికేట్స్ తయారు చేయించే వారు.

    అయితే ఇందుకోసం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి ఇంటర్‌నెట్ నిర్వహిస్తున్న వారితో ఫేక్ సర్టిఫికెట్స్ స‌ష్టిస్తున్న ముఠాను ముందస్తు సమాచారంతో వరంగల్ పోలీసులు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. వారితో పాటు వివిధ యూనివర్శిటీలకు చెందిన 12 నకిలీ సర్టిఫికెట్లు , 6 ల్యాప్‌ట్యాప్‌లు , 1 ఐపాడ్ , 2 ప్రింటర్లు , 25 నకిలీ రబ్బర్ స్టాంపులు , ప్రింటింగ్ మెటిరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

    ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా . తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు. అరెస్ట్ చేసిన నిందితుల్లో ఇద్దరు ప్రధాన నిందితులు కాగా వారికి ,కంప్యూటర్ పరిజ్ఞానం కలిగివుండటంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దార అరుణ్ , ఆకుల రవి అవినాష్‌లు ఇంటర్ నెట్ సెంటర్ నిర్వహిస్తుండే వాళ్లు , ఈ నెట్ సెంటర్ ద్వారా వచ్చే ఆదాయం తన జీవనానికి సరిపోకపోవడంతో పాటు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోవాలనికున్నారు . ఇలా తమకున్న కంప్యూటర్ టెక్నాలజీతో ముందుగా చిన్న చిన్న నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేశారు. ఈ విధంగా నకిలీ సర్టిఫికెట్లను తయారు చేయడం ద్వారా వచ్చే ఆదాయం పెద్ద మొత్తంలో వుండటంతో నిందితులు కావల్సిన వ్యక్తలకు దేశంలోని వివిధ విశ్వవిద్యాలయలు , డ్రీమ్డ్ యూనివర్శిటిలోని ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను తయారి పై పడ్డారు..

    Paddy Dispute : టీఆర్ఎస్ కంటే ముందే బీజేపీ అటాక్..... టీఆర్ఎస్‌కు నో అపాయింట్‌మెంట్..ఎవరి వాదన వారిదే


    వీరికి హన్మకొండ , పరిధిలోని కోన్ని కన్సల్టెన్సీ సంస్థలు విదేశాల్లో విద్య అభ్యసించాలనుకునే వ్యక్తులు , విద్యార్థులకు ఎలాంటి విద్యార్హతలు లేకున్నా ఆయా , ఆయా కన్సల్టెన్సీ యాజమాన్యం తమ కావల్సిన విద్యాసంస్థలకు సంబంధించిన సర్టిఫికెట్లు తయారు చేయాల్సిందిగా వీరికి చెప్పెవారు.. ఇక ఇక్కడితో ఆగకుండా ఫేక్ సర్టిఫికెట్స్‌తో విదేశీ యూనివర్శిటిల్లో సైతం అడ్మిషన్ల కోసం ప్రయత్నించి సక్సెస్ కావడంతో ఆ దిశగా అడుగులు వేశారు.

    Pet dog Licence : జంతు ప్రేమికులకు షాక్.. ఇంట్లో కుక్కకు ఇక లైసెన్స్ కావల్సిందే... లేదంటే ...


    ఈ విధంగా నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విధ్యార్థులను విదేశాలకు పంపించేందుకుగాను ఈ ముఠా లక్ష రూపాయల నుండి నాలుగు లక్షల రూపాయల వరకు డబ్బును చేసినట్టు సీపి వివరించారు. ఇందుకోసం ఉపయోగించే కాగితాన్ని సైతం విదేశాల నుండి ఆన్‌లైన్‌ ద్వారా తెప్పించుకునే వారని ఆయన తెలిపారు. ఇలా నకిలీ సర్టిఫికెట్స్ ద్వారా విదేశాల్లో ఉంటున్న మొత్తం 69 మందిని గుర్తించినట్టు సీపీ తెలిపారు.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime news, Warangal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు