WARANGAL POLICE FIND OUT MISSING GIRL WHO WENT AWAY FROM HOME VRY
warangal : ఫేస్బుక్ అట్రాక్షన్.. వరంగల్ టు తిరుపతి.. అమ్మాయిని ట్రాప్ చేసిన యువకుడు...
(ప్రతీకాత్మక చిత్రం)
warangal :తన కూతురు కనిపించడం లేదంటూ వరంగల్ జిల్లా పర్వతగిరి పోలీసు స్టేషన్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఓ తండ్రి కేసును పోలీసులు చేదించారు...యువకుడి వలలో పడి తిరుపతికి వెళ్లిన బాలికను పోలీసులు పట్టుకున్నారు.
పర్వతగిరి మండలంలోని చౌటపల్లికి చెందిన మంత్రి నాగరాజుకు 9th క్లాస్ చదువుతున్న కూతురు ఫేస్బుక్ మాయలో పడింది. అయితే 14 ఏళ్ల ఆ బాలికను తిరుపతికి చెందిన రాజశేఖర్ అనే 28 ఏళ్ల యువకుడు ట్రాప్ చేశాడు. ఫేస్బుక్లో నిత్యం చాటింగ్ చేస్తూ..అమ్మాయిని తన మాయలో పడేశాడు. దీంతో తన వద్దకు రావాలని చెప్పడంతో ఆ మైనర్ బాలిక ఇంట్లో నుండి పారిపోయింది. ప్రియుడి చెప్పినట్టుగానే విని తల్లిదండ్రులకు కాదని అతని వద్దకు వెళ్లిపోయింది. అయితే ఇవేమీ తెలియని అమాయక తండ్రి కూతురు కోసం తహతహలాడి తన ప్రాణాలను తీసుకున్నాడు. దీంతో విషయం కాస్త సంచలనంగా మారడంతో పోలీసులు 5రోజుల్లోనే బాలిక మిస్టరీని చేధించారు.
వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఈ దారుణం చోటు చేసుకుంది. మండలంలోని చౌటపల్లికి చెందిన మంత్రి నాగరాజుకు 9th క్లాస్ చదువుతున్న కూతురు ఉంది. అయితే ఆమె ఈనెల 7న ఇంటినుండి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులతో పాటు పోలీసులు వెతికినా నాగరాజు కూతురి అడ్రస్ మాత్రం లభించలేదు. కారణాలు తెలియకుండా వెళ్లిపోయిన కూతురు కోసం తండ్రి తపన పడ్డాడు..ఎందుకు వెళ్లిపోయిందో కూడా తెలియని పరిస్థితుల్లో పోలీసులను అశ్రయించాడు.
పదిరోజులుగా ఆచూకి తెలియకపోవడంతో మనస్థాపం చెందాడు.రోజు పోలీసు స్టేషన్చుట్టు తిరుగుతూ ఆందోళన చెందాడు.. మరోవైపు పరువు కోసం తహాతహ లాడాడు. కూతురు ఇంటినుండి వెళ్లిపోవడంతో చుట్టుపక్కల వాళ్ల మాటలు భరించలేకపోయాడు.
ఈనేపథ్యంలోనే గత శుక్రవారం రాత్రి స్థానిక పర్వతగిరి పోలీసు స్టేషన్‌కు చేరుకుని మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితున్ని గమనించిన పోలీసులు హుటాహుటినా ఆసుపత్రికి తరలించినా..ఫలితం లేకపోయింది.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
దీంతో శుక్రవారం మరోసారి నాగరాజు స్థానిక పర్వతగిరి పోలీసు స్టేషన్‌కు మద్యం మత్తులో చేరుకున్నాడు. పోలీసు స్టేషన్ సమీపంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.దీంతో కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు అమ్మాయి మిస్టరీని చేధించారు..అయితే ముందుగా ఆ అమ్మాయి తెలివిగా ఇంట్లోనే తన మొబైల్‌ను పెట్టిపోయింది. దీంతో కేసును చేధించడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఫోన్ ద్వారా తిరుపతికి చెందిన యువకుడితో చాలా రోజులుగా చాటింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో స్థానిక సీఐ విశ్వేశ్వర్ తోపాటు ప్రత్యేక బృందాలుగా విడిపోయి బాలిక అడ్రస్‌ను చేధించారు.
అనంతరం మైనర్ బాలికను చైల్డ్‌హోంకు పంపించారు. ఇక ట్రాప్ చేసిన రాజశేఖర్ పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు. కాగా స్మార్ట్ ఫోన్‌తోపాటు లాక్డౌన్ నేపథ్యంలోనే పిల్లలు ఆన్లైన్ క్లాస్‌లు వింటూ నిత్యం ఫోన్‌కు అలవాటు పడడంతో ఈ దారుణాలు చోటు చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇలాంటీ పరిణామాల నేపథ్యంలోనే పిల్లలను నిత్యం కనిపెడుతూ ఉండాల్సిన భాద్యత తల్లిదండ్రులకు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.