మావోయిస్టు పేరుతో కిడ్నాప్ చేసి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న అంతర్ జిల్లా నకిలీ నక్సలైట్లను మహబూబాబాద్ జిల్లా సిసిఎస్ బయ్యారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురిని నకిలీ మావోయిస్టులను అరెస్టు చేసి డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో ప్రజా ప్రతిఘటన దళ కమాండర్ గా పనిచేసిన ఉప్పునూతల ముత్తయ్య, పసుల లింగయ్య, నిమ్మల లింగయ్యతో పాటు మరొకరితో కలిసి మావోయిస్టుల పేరుతో డబ్బులు వసూలు చేద్దామని నిర్ణయించుకున్నారు. 2022 డిసెంబర్ నెలలో బయ్యారం కొత్తపేట గ్రామ పరిధిలో తన వ్యవసాయ పొలం వద్దకు ఇల్లందు నుంచి వచ్చి వెళ్లే పాత ఇనుప సామాన్ల వ్యాపారి యాదగిరి రెడ్డిని బెదిరించి డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు.
పథకం ప్రకారం 17 రోజులుగా అతని పొలం వద్ద కాపుకాసి రెక్కి నిర్వహించారు. గత సంవత్సరం డిసెంబర్ 20న మధ్యాహ్నం సమయంలో పోలంవద్దకు వచ్చిన యాదగిరి రెడ్డిని తమ వెంట తెచ్చుకున్న తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేశారు. నక్కలగుట్ట వైపుకు తీసుకెళ్లి అడవి ప్రాంతంలోకి తీసుకెళ్లారు. తమను మావోయిస్టు నేత హరి భూషణ్ పంపించారని, మావోయిస్టు చందా ఇవ్వాలని 20 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు.
అయితే హరి భూషణ్ చనిపోయాడు కదా అనడంతో మాకు ఎదురు చెప్తావా అంటూ సదరు వ్యక్తులు చితకబాదారు. దీంతో భయపడి బాధితుడు ఒక లక్ష 25 వేల రూపాయలు ఇస్తానని ఒప్పుకొని తన కొడుకుకు కార్తీక్ కు ఫోన్ చేసి డబ్బు ఇటుక బట్టి వాళ్లకు ఇవ్వాలని, కొత్తపేట వెంకట్రావు ఇటుక బట్టి వద్దకు రమ్మని డబ్బులు ఇచ్చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించారు. అయితే ఈ ఘటనపై 15న ఇల్లందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కొల్లి యాదగిరిరెడ్డి బయ్యారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal