WARANGAL PET DOG WHO TOOK ONE AND HALF LAKHS CASH FROM THE OWNER HOUSE IN WARANGAL DISTRICT SNR
Warangal:లక్షన్నర క్యాష్ మాయం చేసిన పెంపుడు కుక్క..డబ్బుల కోసం యజమాని వెదుకులాట
ప్రతీకాత్మకచిత్రం
Warangal:విశ్వాస జంతువు కదా అని పెంచుకున్నారు. వ్యాపారం చేసి తెచ్చుకున్న లక్షన్నర క్యాష్ ఎత్తుకెళ్లింది. వరంగల్ జిల్లాలో ఓ గొర్రెల వ్యాపారికి ఎదురైన చేదుఅనుభవం ఇది. గొర్రెలు విక్రయించగా వచ్చిన డబ్బును ఇంట్లో మంచంపై పెడితే కుక్క నోటికి కరుచుకొని ఎత్తుకెళ్లింది. ఆ డబ్బుల కోసం కుక్క యజమాని కాళ్లు అరిగేలా తిరిగి వెదుకుతున్నాడు.
ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేడనే సామెత ఉంది. దాన్ని పెంపుడు కుక్క ఎత్తుకెళ్లిన డబ్బు ఎవ్వడూ తెచ్చివ్వలేడని మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ విచిత్రమైన సంఘటన బాధితుడికి కన్నీరు తెప్పిస్తున్నా...విన్న వాళ్లకు మాత్రం నవ్వు తెప్పిస్తోంది. వరంగల్ (Warangal)జిల్లా దుగ్గొండి(Duggondi) మండలం నాచినపల్లి(Nachinapalli)కి చెందిన గొర్రెల వ్యాపారి కాసు చేరాలు( Kasu cheralu)అనే వ్యక్తికి జరిగిన చేదుఅనుభవం ఇది. గొర్రెలు మేపుతూ వాటిని మార్కెట్లో అమ్ముతూ జీవనోపాధి పొందుతునన చేరాలు యధావిధిగా బుధవారం (Wednesday)కూడా తన దగ్గరున్న గొర్రెలను మార్కెట్లో అమ్మి వచ్చిన లక్షన్నర నగదు(One and half lakh)ను తన నుడుం జోలెలో కట్టుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత సంత నుంచి తెచ్చిన డబ్బుల జోలెను మంచంపైన పెట్టి స్నానానికి వెళ్లి వచ్చేలోపు డబ్బు మాయమైంది. చేరాలు స్నానానికి వెళ్లే ముందు మంచం దగ్గర తన పెంపుడు కుక్క (Pet dog)కాపాలా ఉండటం చూసే అంత పెద్ద మొత్తంలో డబ్బును మంచం దగ్గర పెట్టి వేళ్లాడు. తీరా వచ్చే సరికి డబ్బులు లేకపోవడంతో షాక్ అయ్యాడు. స్నానానికి వెళ్లి వచ్చేలోపే జరిగిన విషయం తెలియక కాసేపు డబ్బు కోసం మంచ చుట్టుపక్కల వెదికాడు. ఎక్కడా డబ్బులు కనిపించకపోవడంతో చేరాలు తాను తెచ్చిన ఎవరో ఎత్తుకెళ్లలేదని తన పెంపుడు కుక్కే నోటికి కరుచుకొని డబ్బులు తీసుకెళ్లిందని పసిగట్టాడు.
ఓనర్ సొమ్ము ఎత్తుకెళ్లిన కుక్క..
అంతే కుక్క చేసిన పనికి కుటుంబ సభ్యులను వెంట పెట్టుకొని ఊరంతా వెదికారు. కుక్క గొర్రెలు విక్రయించగా వచ్చిన లక్షన్నర డబ్బును ఏం ఏమైపోయాయో..కుక్క ఎక్కడ పడేసిందో తెలియక అయోమయానికి గురయ్యారు. రోడ్లు, కానీలో వెదికిన చేరాలు అతని కుటుబం సభ్యులు రోడ్డుపై కనిపించిన ప్రతి ఒక్కరిని తమ డబ్బుల సంచి కుక్క ఎత్తుకెళ్లి పారేసేంది మీకేమైనా దొరికిందా అంటూ కనిపించిన ప్రతి ఒక్కరిని అడిగారు. ఎవరూ డబ్బులకు సంబంధించిన సమాచారం ఇవ్వకపోవడంతో నిరాశగా ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో విశ్వాసంగా పడివుంటుందని కుక్కను పెంచుకుంటే కష్టపడి సంపాధించిన డబ్బును పరులపాలు చేసిందని యజమాని చేరాలు కన్నీటిపర్యంతమయ్యాడు.
లక్షన్నర డబ్బు పోగొట్టుకున్న యజమాని..
పోయిన డబ్బు వందలు, వేలు కాకపోవడంతో రైతు లబోదిబోమన్నాడు. విశ్వాసంగా ఇంటి పట్టున ఉంటుందని కుక్కను పెంచుకుంటే గొర్రెలు విక్రయించగా వచ్చిన డబ్బంతా దోచుకెళ్లిందని చేరాలు ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బులు పోతే పోలీసు ఫిర్యాదు ఇవ్వవచ్చు...ఇంట్లో ఉంచిన డబ్బులు కుక్క పారేస్తే ఏమని కంప్లైంట్ ఇవ్వాలో అర్ధం కాక ...కుక్క చేసిన పనికి తలలు పట్టుకుంటున్నారు చేరాలు కుటుంబ సభ్యులు. అందరి ఇళ్లలో కుక్కలు పెంచుకోవడం ఫ్యాషనైపోయింది. డబ్బు ఉన్నొళ్లు, లేనోళ్లు చివరకు వ్యాపారస్తులు కూడ కుక్కల్ని నమ్మినంతగా కన్నవాళ్లను, కడుపున పుట్టిన వాళ్లను నమ్మడం లేదు. ఈ ఘటన తెలిసిన తర్వాతైనా పెంపుడు కుక్కల్ని కూడా నమ్మకూడదని తెలుసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.