Santhosh, News 18, Warangal
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిత్యం రోగులతో బిజీగా ఉంటుంది. ఈ ఆసుపత్రికి వరంగల్ జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి ఆసుపత్రికి వైద్యం కోసం వస్తారు. అయితే, ఎన్నో హంగులతో అత్యాధునిక పరికరాలతో నైపుణ్యం కలిగిన వైద్యులతో, కోట్ల రూపాయలతో నిర్మిచిన ఇంతటి ఆసుపత్రిలో చిన్న చిన్న లోపాలతో కష్టాలు పడుతున్నారు రోగులు.
Read Also : చల్లని లంబసింగిలో జనం ఇష్టపడే ఐటమ్ ఇదే!
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈఈజీ (Electroencephalogram) పరీక్షకు టెక్నీషియన్లు లేక రోగుల వైద్యసేవలకు అంతరాయం ఏర్పడుతోంది. మెదడు రుగ్మతలు, మూర్చ రుగ్మతలు, కణితులు, తలకు గాయం, మెదడు పనిచేయకపోవడం, నిద్ర, మెదడువాపు, కోమాలో ఉన్నవారిలో మెదడు పనితీరును నిర్ధారించడానికి ఈ పరీక్షలు అవసరమవుతాయి.
సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభమై రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు టెక్నీషియన్ ని పెట్టకపోవడం రోగులకు, డాక్టర్లకు సమస్యగా మారింది. ఓపీ సమయాల్లో 200 మందికి తక్కువగాకుండా మెదడు సంబంధిత సమస్యలతో రోగులు వస్తున్నారు. వారందరికీ వైద్యులు ఈఈజీ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఆసుపత్రిలో EEG యంత్రం ఉన్నా టెక్నీషియన్లు లేరు. ప్రభుత్వం నాలుగు పోస్టులు మంజూరు చేసినా రెండేళ్లుగా భర్తీచేయలేదు. ఎంజీఎంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను సూపర్‌స్పెషాలిటీ అసువత్రికి పంపించి ఈ పరీక్షలు చేయించడం కష్టంగా మారింది.
ఒకేరోజు అందరికీ పరీక్షలు చేయడం సాధ్యం గాక రోజుకు కొందరికే చేస్తుండటంతో రోగ నిర్ధారణ కాక ఆలస్యమై చికిత్స అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. టెక్నీషియన్ల నియమించకపోవడంతో EEG పరీక్షల కోసం వేచి ఉన్న రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈవిషయంపై కేఎంసీలో సమస్య ఏర్పడుతోంది. అత్యవసర సమయంలో వచ్చిన పేషెంట్స్ కి సరైన సమయంలో టెక్నీషియన్ లేకపోతే తాము ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుందని వైద్యులు చెప్తుండగా.. ఎన్నిసార్లు వచ్చినా ఇలాగే జరుగుతుందనిరోగులు వాపోతున్నారు. కనీసం ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి టెక్నీషియన్ కొరతపై సమస్యని పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal